అహింసాయుత ఉద్యమం గాంధీ మార్గం, అదే మార్గంలో రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ : మంత్రి జగదీష్ రెడ్డి

Swatantra Bharata Vajrotsavalu Minister Jagadish Reddy Partcipated in Freedom Cup Games Closing Ceremony, Minister Jagadish Reddy Partcipated in Freedom Cup Games Closing Ceremony, Telangana Minister Jagadish Reddy Partcipated in Freedom Cup Games Closing Ceremony, Freedom Cup Games Closing Ceremony, Freedom Cup Games, Telangana Minister Jagadish Reddy, Jagadish Reddy, Swatantra Bharata Vajrotsavalu, Closing Ceremony, Swatantra Bharata Vajrotsavalu News, Swatantra Bharata Vajrotsavalu Latest News And Updates, Swatantra Bharata Vajrotsavalu Live Updates, Mango News, Mango News Telugu,

అహింసాయుత మార్గం తోటే మహాత్మాగాంధీ స్వాతంత్య్రం సాధించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ఆయన తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫ్రీడమ్ కప్ క్రీడా పోటీల ముగింపు ఉత్సవాలకు మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మేకల అభినవ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్రీడా పోటీల విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్రా సుధాకర్, మున్సిపల్ కమిషనర్ కేవి రమణా చారి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను మూడో తరానికి తెలియచెప్పాలన్న సంకల్పంతోటే సీఎం కేసీఆర్ వజ్రోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారన్నారు. 780 సంస్థానాలుగా ఉన్న భారతదేశంలో ఐకమత్యం లేక పోవడం, వర్ణ వ్యవస్థతో విడి పోవడంతో అతి చిన్న దేశాలు కుడా భారతదేశంపై దండ యాత్ర సాగించాయన్నారు. అటువంటి పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాలో బారిస్టార్ విద్యను పూర్తి చేసుకున్న మహాత్మాగాంధీ దేశానికి చేరుకుని భిన్నత్వంలో ఏకత్వం సాధించి దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టారన్నారు. ఆ స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్న నేటి తరానికి స్వాతంత్య్ర సంగ్రామ అనుభవాలు తెలియవన్నారు. స్వేచ్ఛ లేనప్పుడే స్వాతంత్య్రం గురించి తెలుస్తోందని అటువంటి చరిత్రను తెలియజెప్పడమే వజ్రోత్సవ వేడుకల సారాంశమన్నారు. అటువంటి స్ఫూర్తిని నేటి తరం అలవర్చుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి యువతకు సూచించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =