సీఎం కేసీఆర్ అధ్యక్షతన జూలై 26న తెలంగాణ దళిత బంధుపై తొలి అవగాహన సదస్సు

CM KCR To held Meeting with Huzurabad People at Pragathi Bhavan on July 26, CM to launch Telangana Dalitha Bandhu scheme, Dalith Bandhu, Dalitha Bandhu, Dalitha Bandhu Scheme, dalitha bandhu telangana, GO issued for implementation of Telangana Dalit Bandhu, Huzurabad, Mango News, Pragathi Bhavan, Telangana CM Chandrasekhar Rao, Telangana Dalit Bandhu scheme for Dalit empowerment, Telangana Dalita Bandhu to start, Telangana Dalita Bandhu to start from Huzurabad, Telangana Dalitha Bandhu

హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభంకానున్న ‘తెలంగాణ దళిత బంధు’ పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ మరియు విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై తొలి అవగాహన సదస్సును ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరుగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం దాకా జరగనున్న ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామానికి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు), ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) మొత్తం 412 మంది దళిత పురుషులు, మహిళలు పాల్గొననున్నారు. వారితో పాటు 15 మంది రిసోర్సు పర్సన్స్ సహా మొత్తం 427 మంది హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితులు ఈ అవగాహన సదస్సులో పాల్గొంటారు.

ఈ సదస్సు గురించి సీఎం కేసీఆర్ వివరిస్తూ ‘‘జూలై 26న హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల నుంచి వారి వారి మండల కేంద్రాలకు ఉదయం 7 గంటలకు చేరుకుంటారు. మండల కేంద్రంలో అల్పాహార కార్యక్రమం ముగించుకుని అక్కడ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో హుజూరాబాద్ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి హైదరాబాద్ కు మొత్తం 427 మంది పలు బస్సుల్లో బయలుదేరుతారు. ఉదయం 11 గంటల వరకు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు చేరుకుంటారు’’ అని సీఎం తెలిపారు.

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ‘దళిత బంధు’ పథకం ముఖ్య ఉద్దేశ్యం, పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణతో పాటు పథకాన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద సీఎం వారికి అవగాహన కల్పిస్తారు. ఫైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో ప్రారంభంకానున్న దళిత బంధు పథకం, రాష్ట్రంలోని దళితులందరి జీవితాల్లో గుణాత్మక మార్పుకు ఏవిధంగా దోహదపడుతుంది, పైలట్ ప్రాజెక్టును హుజూరాబాద్ లో చేపట్టిన నేపథ్యంలో చారిత్రాత్మక పథకంలో ఆ ప్రాంత బిడ్డలుగా ఎట్లా లీనమై పనిచేయాలె, దళితుల సామాజిక ఆర్థిక గౌరవాన్ని ఉన్నతశిఖరాల్లో నిలబెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న తెలంగాణ దళిత బంధు పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు ఏమిటి? సీఎం మానస పుత్రికయిన ఈ పథకాన్ని ఎట్లా దళితుల్లోకి తీసుకపోవాలె? వారి జీవితాలను వారే అభివృద్ధి చేసుకునే దిశగా ఎట్లా వారికి అవగాహన కల్పించాలె? అధికారులతో ఎట్లా సమన్వయం చేసుకోవాలె, కలిసి పోవాలె? అనే తదితర అంశాలను ఇంటరాక్షన్ సెషన్ లో హాజరైన వారికి సీఎం కేసీఆర్ వివరించి అవగాహన కల్పించనున్నారు. మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత కొనసాగే అవగాహన సదస్సు సాయంత్రానికి ముగియనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =