ఘనంగా పోలీస్ అమర వీరుల దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్-డే కార్యక్రమాలు – డీజీపీ మహేందర్ రెడ్డి

DGP Mahender Reddy, DGP Mahender Reddy Held Review on Police Commemoration Day, Mango News, Police Commemoration Day, Police Commemoration Day 2021, Police Commemoration Day Programme, Police Flag Day Programme, Police Flag Day Programme 2021, Police Flag Day Programs, Police Martyrs Day, Review on Police Commemoration Day, Telangana DGP Mahender Reddy, Telangana DGP Mahender Reddy Held Review on Police Commemoration Day

అక్టోబర్ 21 తేదీన నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు, 21 వ తేదీ నుండి అక్టోబర్ 31 వ తేదీ వరకు పోలీస్ ఫ్లాగ్ డే పేరుతోసంస్మరణ దినోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో పోలీసు అమర వీరుల దినోత్సవాల ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు డీజీపీలు గోవింద్ సింగ్, రాజీవ్ రతన్, జితేందర్, శివధర్ రెడ్డి, అనీల్ కుమార్, స్వాతి లక్రా, ఐజీలు ప్రభాకర్ రావు, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, పూర్తిగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిర్వహించే ఈ పోలీసు అమరవీరుల దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలలో పౌరులు పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31వ వరకు నిర్వహించే కార్యక్రమాలను పోలీస్ ఫ్లాగ్- డే గా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని వెల్లడించారు.

అక్టోబర్ 21 నుండి 31 వరకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రతి జోన్ లో ఒక పోలీస్ స్టేషన్ లో ప్రత్యేకంగా ఓపెన్ హౌస్ నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆన్లైన్ పద్దతిలో వ్యాసరచన పోటీలు నిర్వహణ, భారత స్వతంత్ర పోరాట స్ఫూర్తిని కలుగ చేసే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పోలీసింగ్ అంశంపై ఫోటోగ్రఫీ కాంపిటీషన్, స్వల్ప నిడివి గల వీడియో కాంపిటీషన్ లను నిర్వహిస్తామని తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − four =