స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌-2023 లో టాప్ 3 జిల్లాలు తెలంగాణవే, మంత్రి కేటీఆర్ అభినందనలు

Top 3 Districts in Swachh Survekshan Grameen 2023 are from Telangana Minister KTR Appreciates Minister Errabelli Officials,Swachh Survekshan Grameen 2023,Swachh Survekshan Grameen,Telangana Minister KTR,Appreciates Minister Errabelli Officials,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,BRS President Thota Chandrasekhar,Thota Chandrasekhar

స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌-2023లో హై అఛీవర్ జిల్లాలకు సంబంధించి 2022, డిసెంబర్‌ కు కేంద్రం 4 స్టార్‌ క్యాటగిరీ ర్యాంకింగ్స్‌ ప్రకటించింది. ఈ 4 స్టార్‌ క్యాటగిరీ ర్యాంకింగ్స్‌ లో దేశంలోనే మొదటి మూడు స్థానాలను తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు దక్కించుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, కరీంగనర్‌ జిల్లా ద్వితీయ స్థానంలో, పెద్దపల్లి జిల్లాలో తృతీయ స్థానం నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌-2023 లో తెలంగాణ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో నిలవడం పట్ల సంబంధిత మంత్రికి, ఆయా జిల్లాల కలెక్టర్లకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

“తెలంగాణ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023లోని టాప్ 3 జిల్లాలన్నీ తెలంగాణకు చెందినవే. రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు, ఆయన శాఖకు అభినందనలు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక అభినందనలు” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 20 =