టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో ప్రభుత్వం చర్యలు.. ప్రధాన నిందితులు రేణుక సహా ఆమె భర్త ఉద్యోగాలు తొలగింపు

TSPSC Paper Leak Case Telangana Govt Dismissed Prime Accused Renuka and Her Husband From Their Jobs,TSPSC Paper Leak Case,Telangana Govt Dismissed Prime Accused Renuka,Renuka and Her Husband Dismissed From Their Jobs,Mango News,Mango News Telugu,Nine Arrested For TSPSC Exam Paper Leak,SIT In TSPSC Paper Leak Case,TSPSC Paper Leak Not Institutional Failure,TSPSC Cancels Group-I Prelims,TSPSC Paper Leak Scam,TSPSC Examinations Latest Updates,TSPSC Recruitment Latest Updates,TSPSC Examinations Latest Updates,TSPSC Recruitment Latest Updates,Chairman Janardhan Reddy Latest News

తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్‌ లీకేజీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కేసులో కీలక నిందితురాలైన రేణుక సహా ఆమె భర్త, మరో నిందితుడు అయిన డాక్యా నాయక్‌పై వేటు పడింది. రేణుక వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలం బుద్ధారం బాలికల గురుకుల పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రెటరీ రోనాల్డ్ రోస్‌కి స్కూల్‌ ప్రిన్సిపల్ నివేదిక పంపడంతో రేణుకని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రేణుక భర్త డాక్యా నాయక్‌ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ కృష్ణన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉద్యోగ తొలగింపు ఉత్తర్వులు అందజేసేందుకు డాక్యా అందుబాటులో లేనందున, గండీడ్‌ మండలం పంచాంగల్‌ తండాలోని ఆయన కుటుంబసభ్యులకు అందజేసినట్లు ఎంపీడీవో నాగవేణి తెలిపారు.

కాగా ఈ కేసులో ఇప్పటికే రేణుక మరియు ఆమె భర్త ఇరువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మొత్తం 9 మంది నిందితులను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిలో ప్రధాన నింధితులైన రాజశేఖర్, ప్రవీణ్, రేణుకను విడివిడిగా విచారించగా.. అనేక కీలక విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. రాజశేఖర్ ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా తేలింది. అతను టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని పలు కంప్యూటర్ల పాస్‌వర్డులు తెలుసుకుని అందులోని ప్రశ్నాపత్రాలను కాపీ చేసి ప్రవీణ్‌కు ఇచ్చేవాడు. వాటిని ప్రవీణ్ రేణుకకు అందజేసేవాడు. ఈ క్రమంలో రేణుక పలువురు ఉద్యోగార్ధులకు జాబ్ ఆశచూపి లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసేదని గుర్తించారు. మరోవైపు దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరుగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + ten =