ఏపీలో మున్సిపల్ ఎన్నికలు: జిల్లాల వారీగా బీజేపీ ఇన్‌ఛార్జులు నియామకం

2021 AP Municipal Elections, AP BJP, AP BJP Appoints Incharges and Co-ordinators, AP Municipal Election Updates, AP Municipal Elections, AP Municipal Elections 2021, AP Municipal Elections Date, AP Municipal Elections News, AP Municipal Elections Notification, BJP Appoints Incharges and Co-ordinators for Municipal Elections, Incharges and Co-ordinators for Municipal Elections, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10 వ తేదీన 12 కార్పోరేషన్స్, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పోరేషన్స్, మునిసిపల్, అలాగే ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి అన్ని రెవెన్యూ జిల్లాలకు ఇన్‌ఛార్జులును, సమన్వయకర్తలను బీజేపీ నియమించింది. వీరి వివరాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు:

  • ఇన్‌ఛార్జులు: జీవీఎల్‌ నరసింహారావు, కంభంపాటి హరిబాబు, పి.వి.ఎన్ మాధవ్‌, విష్ణుకుమార్‌ రాజు, కాశీవిశ్వనాథరాజు.
  • సమన్వయకర్తలు: లోకుల గాంధీ, ఎస్.ఉమా మహేశ్వరి, కోడూరు లక్ష్మీనారాయణ.

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు:

  • ఇన్‌ఛార్జులు: సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, చిన్నం రామకోటయ్య, అంబికా కృష్ణ.
  • సమన్వయకర్తలు: వేటుకూరి సత్యనారాయణరాజు, పాక వెంకట సత్యనారాయణ, బి.శ్రీనివాస్ వర్మ.

గుంటూరు, ప్రకాశం జిల్లాలు:

  • ఇన్‌ఛార్జులు: కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిశోర్‌బాబు.
  • సమన్వయకర్తలు: నాగోతు రమేష్ నాయుడు, పాతూరి నాగభూషణం, సుధాకర్ యాదవ్.

నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు:

  • ఇన్‌ఛార్జులు: సీఎం రమేశ్‌, ఆదినారాయణరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి.
  • సమన్వయకర్తలు: విష్ణువర్ధన్ రెడ్డి, కమల, కునిగిరి నీలకంఠ, కోలా ఆనంద్.

అనంతరపురం, కర్నూల్ జిల్లాలు:

  • ఇన్‌ఛార్జులు: టీజీ వెంకటేశ్‌, పార్థసారధి, వరదాపురం సూరి, ఎం.ఎస్ పార్ధసారధి.
  • సమన్వయకర్తలు: చిరంజీవి రెడ్డి, చంద్రమౌళి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − twelve =