శ్రీశైలం పర్యటన రద్దు చేసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Cancels Srisailam Tour After Fire Mishap at Power Station, Fire in Srisailam hydel power station, Fire Mishap at Srisailam Power Station, Massive fire erupts at Telangana power station, srisailam dam, Srisailam power house fire, Srisailam Power Plant, Srisailam Power Station, telangana, Telangana Srisailam Power Plant Fire

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి‌ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 21, శుక్రవారం నాడు శ్రీశైలంలో పర్యటించాల్సి ఉంది. కానీ శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుని, అక్కడ సహాయక చర్యలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం ఈ రోజు తన రద్దుచేసుకున్నట్లుగా సీఎంఓ అధికారులు వెల్లడించారు. శ్రీశైలం జలాశయంలోకి వరుసగా రెండో సంవత్సరం కూడా వరదనీరు భారీగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారులు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువ నాగార్జున సాగర్ కు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు అంశాలతో పాటుగా ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించి, పూజలు నిర్వహించేందుకు సీఎం వైఎస్ జగన్ శుక్రవారంనాడు శ్రీశైలంలో పర్యటించాలని భావించారు.

అయితే తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయాన్ని సీఎంఓ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో, ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ సమీక్షా సమావేశాలు నిర్వహించడం సబబు కాదని సీఎం అధికారులతో పేర్కొన్నారు. తన శ్రీశైలం పర్యటనను రద్దుచేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాదం పట్ల సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో భాగంగా ఎలాంటి సహాయం కావాలన్నా వారికి అందించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈ ఘటనలో లోపల చిక్కుకున్న వారంతా క్షేమంగా బయటకురావాలి సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =