కోవిడ్-19 బూస్టర్ డోస్‌గా భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్.. అత్యవసర వినియోగానికి డీజీసీఐ ఆమోదం

Bharat Biotech's Nasal Vaccine as COVID-19 Booster Dose Gets DGCI Nod For Emergency Usage,Bharat Biotech Nasal Vaccine,Covid-19 Booster Dose,DGCI Approval,Nasal Vaccine Emergency Use,Mango News,Mango News Telugu,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ, ‘కోవాక్సిన్’ తయారీదారు అయిన భారత్ బయోటెక్ తయారు చేసిన ఇంట్రానాసల్ ‘ఫైవ్ ఆర్మ్స్’ (చుక్కల ముందు)కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం డీజీసీఐ 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి కోవిడ్-19 బూస్టర్ డోస్‌గా అత్యవసర వినియోగానికి ఈ మందును వినియోగించడానికి అనుమతినిచ్చింది. దీనిప్రకారం.. ఇప్పటివరకు కోవాక్సిన్ లేదా కోవిషీల్డ్ టీకాలు తీసుకున్న వారు 6నెలల తర్వాత కోవిడ్-19 బూస్టర్ డోస్‌గా దీనిని తీసుకోవచ్చు. కాగా ఇలాంటి మందు ప్రపంచంలోనే రెండవది కావడం విశేషం.

ఈ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ మరియు వాషింగ్టన్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది ప్రీ-ఫ్యూజన్ స్టెబిలైజ్డ్ స్పైక్ ప్రోటీన్‌తో కూడిన రీకాంబినెంట్ రెప్లికేషన్ డెఫిసియెంట్ అడెనోవైరస్ వెక్టర్డ్ వ్యాక్సిన్ అని భారత్ బయోటెక్ తెలిపింది. పాండమిక్స్ సమయంలో సామూహిక ఇమ్యునైజేషన్ ప్రచారాలలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొంది. అలాగే దీనిని 2-8 °C వద్ద సులభంగా నిల్వ చేయడానికి మరియు పంపిణీ చేయడానికి అనువుగా ఉంటుందని కూడా తెలియజేసింది. ఇప్పటికే దీనిపై ఎన్నో క్లినికల్ పరీక్షలను నిర్వహించామని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. డీజీసీఐ ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే దీనిని మార్కెట్లో అందుబాటులోకి తీసుకురనున్నట్లు వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − one =