ఎపిఎఫ్‌డిసి చైర్మన్ గా అలీ నియామకం

Ali, Ali Appointed As New APFDC Chairman, Ambika Krishna, AP Film Development Corporation, AP Govt Appoints Comedian Ali As New APFDC Chairman, AP News, Ap Political News, AP Political Updates, AP Politics, APFDC, Comedian Ali, Comedian Ali Appointed As New APFDC Chairman, Mango News Telugu, new Chairman of the APFDC, TDP, Y.S. Jagan Mohan Reddy, YCP, YSRCP

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగు సినీ నటుడు, ప్రముఖ హాస్యనటుడు అలీ వైసీపీ పార్టీలో చేరి, పార్టీ విజయం కోసం పని చేసారు. ఆంధ్రప్రదేశ్ లో అనేక నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి, వైసీపీ పార్టీ విధి విధానాలను, మేనిఫెస్టో ను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సీటు దక్కకపోయినా కూడ పార్టీకి తనవంతు సాయం చేసారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, పార్టీ కోసం పని చేసిన నాయకులందరికీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తగిన పదవులు కట్టబెడుతున్నారు,ఇటీవలే మరో సినీ నటుడు పృధ్విరాజ్ ను ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్‌గా నియమించారు, అదే క్రమంలో వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, హాస్యనటుడు అలీని కూడ ఎపి ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎఫ్‌డిసి) ఛైర్మన్‌గా నియమించినట్టు సమాచారం, దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇంకా రావాల్సి ఉంది.

మంచి పదవితో అలీకి గుర్తింపు దక్కడంతో అభిమానులు అనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో, తెలుగుదేశం పార్టీలో సభ్యుడైన అంబికా కృష్ణ ఎపిఎఫ్‌డిసి చైర్మన్ పదవిలో కొనసాగారు, కాని టిడిపి ఓటమి తరువాత ఆయన రాజీనామా సమర్పించి బీజేపీ పార్టీలో చేరడంతో ఎపిఎఫ్‌డిసి పోస్టు ఖాళీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకు అలీని ఎపిఎఫ్‌డిసి కొత్త ఛైర్మన్ గా ప్రకటించనుంది, అలీ త్వరలోనే తన బాధ్యతలు స్వీకరిస్తారు.

 

[subscribe]
[youtube_video videoid=_7oz9qBD4RE]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 18 =