మిలీనియం టవర్స్ కోసం నిధుల విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Latest News, AP Breaking News, AP Millennium Tower, AP Political Updates 2020, Funds For Millennium Tower-B Construction, Mango News Telugu, Millennium Tower Construction Works, Millennium Tower-B Construction,Andhra Pradesh Millennium Tower
పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా నిర్ణయిస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే విశాఖపట్నంలో గల మిలీనియం టవర్స్‌లో సచివాలయం కార్యకలాపాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖలోని మధురవాడ వద్ద మిలీనియం టవర్‌-బి నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. టవర్‌-బి నిర్మాణం కోసం ఐటీశాఖకు రూ.19.73 కోట్లు నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిలీనియం టవర్స్ లో టవర్‌-ఏ నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే పూర్తిచేసింది. ఇతర ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకునేందుకే పూర్తి స్థాయి టవర్‌-బి నిర్మాణానికి కూడా ప్రభుత్వం నిధులు కేటాయింపులు జరిపినట్టు సమాచారం.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 5 =