ఏపీలో కర్ఫ్యూ సడలింపులు, జూన్ 21 నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంపు

ap to telangana buses latest news, APSRTC, APSRTC BUS, apsrtc bus timings, APSRTC Decided To Increase Bus Services, APSRTC Decided To Increase Bus Services In The State, APSRTC Decided To Increase Bus Services In The State Amid Curfew Relaxations, APSRTC News, apsrtc news today in telugu, Curfew Relaxations, Increase Bus Services In The State Amid Curfew Relaxations, Latest News on apsrtc, Mango News, RTC officials decide to run more number of buses

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 21వ తేదీ నుంచి కర్ఫ్యూ సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచారు. కర్ఫ్యూ సడలింపు నేపథ్యంలో జూన్ 21, సోమవారం నుంచి రాష్ట్రంలో బస్సు సర్వీసులను పెంచాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సు సర్వీసులు నడపాలని, జిల్లాల మధ్య పగలు నడిచే దూరప్రాంత సర్వీసులను పెంచాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.

అలాగే దూరప్రాంత సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ను పునరుద్ధరించనున్నారు. శనివారం నుంచి బస్సుల్లో ముందస్తు టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయం కూడా కల్పించనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అన్ని కొవిడ్ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేసుకుని బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + nineteen =