ఏపీ పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

CM YS Jagan Mohan Reddy Holds Review Meet on Department of Industries in AP, AP CM YS Jagan Mohan Reddy Holds Review Meet on Department of Industries in AP, YS Jagan Mohan Reddy Holds Review Meet on Department of Industries in AP, Review Meet on Department of Industries in AP, Department of Industries in AP, AP CM Holds Review Meet on Department of Industries in AP, Review Meeting on Department of Industries in AP, AP CM YS Jagan Holds Review Meet on Department of Industries in AP, AP Industries Department, AP Industries Department News, AP Industries Department Latest News, AP Industries Department Latest Updates, AP Industries Department Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ లోని పరిశ్రమల శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమల అభివృద్ధితో పాటు పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లపై కూడా సమీక్ష చేపట్టారు. కాగా ఈ సమావేశానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులనుద్దేశించి కొన్ని సూచనలు చేశారు. వాటిలో కొన్ని కీలక సూచనలు..

  • రాష్ట్రంలో ఎక్కడైతే పరిశ్రమల కోసం ప్రభుత్వం భూములు కేటాయించిందో అక్కడ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం.
  • ఏపీలో ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి, అలాగే ప్రతీ ఏటా క్రమం తప్పకుండా వారికి తగిన ప్రోత్సాహకాలు సకాలంలో అందించాలి.
  • ప్రత్యేక నిధి ద్వారా పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. తద్వారా ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించాలి.
  • ఈ ప్రక్రియకు ముందుకొచ్చే కంపెనీలకు, యూనిట్లకు ప్రభుత్వం తరపున ప్రత్యేక సహాయం అందించాలి. ఈ విధానంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి.
  • పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ద్వారా వాల్యూ అడిషన్‌ నిర్వహిస్తున్నామన్న అధికారులకు ముఖ్యమంత్రి అభినందనలు.
  • గ్రీన్‌ హైడ్రోజన్, అమ్మెనియా తయారీలపై దృష్టి పెట్టి, వీటి అమలుకు సంబంధించి నూతన విధానం రూపొందించాలని అధికారులకు సూచన.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =