నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ, పీఆర్సీపై తుది నిర్ణయం?

Andhra Pradesh, Andhra Pradesh CM YS Jagan Mohan Reddy, AP 11th PRC News, AP CM hold talks with employees, AP Employees PRC Fitment, AP Government Employees, AP Govt Announcement On PRC, AP Govt Employees PRC, AP Govt Employees PRC News, AP Govt Employees PRC Status, AP Govt Employees PRC Updates, CM Jagan to meet the Employee Unions, CM YS Jagan, CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Will Meet Employee Unions, CM YS Jagan Will Meet Employee Unions Today to Discuss on PRC, Mango News, Mango News Telugu, PRC, Suspense continues over PRC

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పీఆర్సీకి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అధికారులతో ఇప్పటికే చర్చించారు. అలాగే అధికారులు, ఉద్యోగ సంఘాలు మధ్య కూడా ఇప్పటికే పలు దశల చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు. సీఎంతో సమావేశం నేపథ్యంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆయా సంఘాలకు ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. కాగా ఈ సమావేశంలో పీఆర్సీ ఫిట్ మెంట్ ఎంత ఇవ్వాలనే దానిపై స్పష్టత రావచ్చని, పీఆర్సీపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − six =