ఏపీ విద్యాశాఖతో ‘బైజూస్‌’ ఒప్పందంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు, మంత్రి బొత్స కౌంటర్

Minister Botsa Satyanarayana Responds Over TDP Chief Chandrababu Comments on AP Govt Agreement with Byju's, AP Minister Botsa Satyanarayana Responds Over TDP Chief Chandrababu Comments on AP Govt Agreement with Byju's, Botsa Satyanarayana Responds Over TDP Chief Chandrababu Comments on AP Govt Agreement with Byju's, TDP Chief Chandrababu Comments on AP Govt Agreement with Byju's, TDP Chief Comments on AP Govt Agreement with Byju's, Chandrababu Comments on AP Govt Agreement with Byju's, TDP Chief Chandrababu Naidu Comments on AP Govt Agreement with Byju's, TDP Chief Nara Chandrababu Naidu Comments on AP Govt Agreement with Byju's, Nara Chandrababu Naidu Comments on AP Govt Agreement with Byju's, AP Govt Agreement with Byju's, AP Minister Botsa Satyanarayana, Minister Botsa Satyanarayana, Botsa Satyanarayana, AP Education Minister Botsa Satyanarayana, Education Minister Botsa Satyanarayana, AP Education Minister, TDP Chief Nara Chandrababu Naidu, Mango News, Mango News Telugu,

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుభవం ఉంటే సరిపోదని, అది నలుగురికి ఉపయోగపడాలని చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. అయితే మద్యం వ్యాపారం నిర్వహించుకునే బొత్స లాంటి వారికి విద్యాశాఖను అప్పగించారని, అందుకే మొన్నటి పదోతరగతి పరీక్షల్లో 2 లక్షల మందికి పైగా ఫెయిల్ అయ్యారని చంద్రబాబు నిన్న విజయనగరం పర్యటన దృష్ట్యా విమర్శించారు. కాగా ఈ కామెంట్లపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదపిల్లలకు అంతర్జాతీయ స్థాయి కలిగిన నాణ్యమైన విద్యను అందించటానికే ‘బైజూస్‌’ కంపెనీతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

ప్రతిపక్ష నేత దీనిని తప్పుబట్టడం ఆశ్చర్యం కలిగిస్తోందని, అసలు బైజూస్‌తో ప్రభుత్వ ఒప్పందం తప్పని ఏ ఒక్కరితోనైనా చెప్పిస్తారా? అని మంత్రి ప్రశ్నించారు. ఆయన కుమారుడిని విదేశాల్లో చదివించారని, పేదపిల్లలకు ఆ అవకాశం లేదని, అందుకే ప్రభుత్వ స్కూళ్ళలోనే ఇంగ్లీష్ మీడియంలో బోధన ఏర్పాటు చేశామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో చేసినట్లు మేం ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం లేదని, ఈ ‘బైజూస్‌’ ఒప్పందం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది విద్యార్థులకు మేలు కలుగనుందని స్పష్టం చేశారు. సామాజికి న్యాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, అధికారంలో ఉండగా ఏం చేశారో అందరికీ తెలుసనీ, ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + six =