ఏపీలో సినిమా టిక్కెట్ల విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలు నిజం కాదు – మంత్రి పేర్ని నాని

Minister Perni Nani Press Meet Over Cinema Ticket Rates Issue in AP, Minister Perni Nani Press Meet Over Cinema Ticket Rates Issue, Minister Perni Nani, Minister Perni Nani Press Meet, Movie Tickets Issue In AP, AP Minister Perni Nani, Andhra Pradesh, Andhra Pradesh Ticket Issues, AP Minister, Minister Perni Nani, Perni Nani, Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, Ticket Price issue, Movie Ticket Issue, Cinema Ticket Issue, movie tickets, Tollywood Live Updates, Tollywood News, Movie News, Movie Updates, Mango News, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల విషయంలో మళ్ళీ రగడ మొదలయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా భీమ్లా నాయక్ విడుదల సందర్భంగా ఈ అంశం మరోసారి చర్చనీయాంశం అయింది. రాష్ట్రంలో అక్కడక్కడా సినిమా ప్రదర్శన నిలిపివేసినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిపై స్పందించాయి. ప్రభుత్వం సినిమాల విషయంలో ఇలా చేయటం సరికాదని విమర్శలు వినిపించాయి. అయితే, మంత్రి పేర్ని నాని ఈరోజు మీడియా సమావేశంలో ప్రతిపక్షాల ఆరోపణలను కొట్టిపడేసారు. ఏపీలో సినిమా టికెట్ ధరలను అధికంగా అమ్మకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది ప్రేక్షకుడికి మేలు జరిగే నిర్ణయం. దీనిపై కూడా విమర్శలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న జీవో 35 ప్రకారం ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంటే జాయింట్ కలెక్టర్ ని కలిసి వారిచ్చిన అనుమతుల మేరకు సినిమాను ప్రదర్శించుకోవాలని హైకోర్టు ఆదేశించింది. దీని ప్రకారం ప్రభుత్వం నడుచుకుంటుంది. ప్రభుత్వం అనేది ప్రజలందరిది.. అంతేకానీ, ఏ ఒక్కరికో మేలు చేయటానికి కాదని మంత్రి నాని తెలిపారు. కొత్త జీవోకి సంబంధించిన పక్రియ జరుగుతోంది. ప్రస్తుతం దీనిపై లీగల్ ఒపీనియన్ కి పంపాము. ముందుగా అనుకున్న ప్రకారం 24వ తేదీకే జీవో రావాల్సి ఉందని, కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన ఒక రెండు రోజులు సమయం పట్టొచ్చని చెప్పారు. అది పూర్తయిన వెంటనే ప్రభుత్వం జీవో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అని మంత్రి పేర్ని నాని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =