మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పరిపూర్ణానంద పోటీ..?

Parvinanandas Contest As MP From Malkajgiri, Parvinanandas Contest As MP, Parvinanandas As MP, Parvinanandas From Malkajgiri, Malkajgiri MP, Paripurnaananda, BJP MP Ticket, Lok Sabha Elections, Latest Paripurnaananda Political News, Paripurnaananda Political News, CM Revanth Reddy, Polictical News, Elections, Mango News, Mango News Telugu
Paripurnaananda, BJP MP Ticket, lok sabha elections

లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. తక్కువ సమయం ఉండడంతో.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఎన్డీయే కూటమితో కలిసి వ్యూహాలు రచిస్తోంది. అటు పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఎలాగైనా గెలుపొందాలని ఉవ్విళ్లూరుతోంది. ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగురవేయాలని తహతహలాడుతోంది. ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేసి.. బీజేపీని గద్దె దించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది.

అయితే అటు బీజేపీ కూడా కాంగ్రెస్ వ్యూహాలను తిప్పికొట్టేలా ప్రతివ్యూహాలు పన్నుతోంది. సర్వేలు కూడా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశాయి. అయినప్పటికీ బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తోంది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు దక్కించుకునేలా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ ముఖ్యనేతలకు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి హైకమాండ్ కీలక సూచనలు చేసింది.

ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా బీజేపీ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే అభ్యర్థులకు సంబంధించి తాజాగా ఓ కొత్త వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందను లోక్ సభ ఎన్నికల బరిలోకి దింపాలని హైకమాండ్ భావిస్తోంది. ఇప్పటికే హైకమాండ్‌ ఎన్నికల్లో పోటీకి సంబంధించి పరిపూర్ణానందతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ ఇంఛార్జ్‌గా పరిపూర్ణానంద పని చేశారు. బీజేపీ గెలుపు కోసం ప్రచారాల్లో పాల్గొని తీవ్రంగా కృషి చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణలో బీజేపీ తరుపున ప్రచారం నిర్వహించారు.

ఈక్రమంలో పరిపూర్ణానందను తెలంగాణలోని మల్కాజ్‌గిరి నుంచి లేదా ఏపీలోని హిందూపూర్ నుంచి పోటీ చేయించాలని బీజేపీ హైకమాండ్ అనుకుంటోందట. తెలంగాణలో మల్కాజ్‌గిరి స్థానాన్ని ఎలాగైనా గెలుచుకొని తీరాలని బీజేపీ హైకమాండ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ స్థానం నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తోంది. అందుకే ఆ స్థానం నుంచి పరిపూర్ణానందను రంగంలోకి దింపాలని హైకమాండ్ అనుకుంటోందట. ఒకవేళ అక్కడి నుంచి కాకపోతే.. హిందూపూర్ నుంచి అయినా పోటీ చేయించాలని భావిస్తోందట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =