పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన పలువురు వైసీపీ నాయకులు

Several YSRCP Leaders Joined the Janasena Party in the Presence of Pawan Kalyan,Ycp Leaders Joined Janasena, Janasena Chief Pawan Kalyan,Ycp Leaders Joined Janasena Party,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy,Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates,Ap General Elections,Ap General Elections Date,Ap Elections,Andhra Pradesh General Elections

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆదివారం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు కీలక నేతలు జనసేన పార్టీలోకి చేరారు. ఆదివారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు బొంతు రాజేశ్వరరావును పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజేశ్వరరావు రాజోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వైసీపీ ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించారు. రాజేశ్వర రావు తన అనుచరులతో కలిసి తాజాగా జనసేనలో చేరారు.

అలాగే విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గురాన అయ్యలును పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి ఆహ్వానించి, పార్టీ కండువా వేశారు. ఇక ఈ సందర్భంగా పి.గన్నవరం నియోజకవర్గం నుంచి నగరం ఏఎంసీ ఛైర్మన్ కొమ్మూరి కొండలరావుకి కూడా పవన్ కళ్యాణ్ పార్టీ కండువా వేసి, జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్(పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − twelve =