రామతీర్థం ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు

Ap Political News, Chandrababu, Chandrababu Latest News, Chandrababu Naidu, Chandrababu Political News, Chandrababu Visits Ramatheertham Temple, Mango News Telugu, Ramatheertham, Ramatheertham Temple, TDP Chief Chandrababu Visits Ramatheertham Temple, TDP Chief Chandrababu Visits Ramatheertham Temple Today

విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలోని కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. శనివారం నాడు వైస్సార్సీపీ, బీజేపీ, టీడీపీ నేతలు రామతీర్థం పర్యటనకు రావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకుంది. శనివారం ఉదయం అమరావతి నుంచి విశాఖపట్నం చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అక్కడి నుంచి రామతీర్థం చేరుకున్నారు. కొండపై ఆలయం వద్దకు చేరుకుని విగ్రహం ధ్వంసమైన ప్రదేశాన్ని, పక్కనే ఉన్న కోనేరును చంద్రబాబు పరిశీలించారు. కోదండరాముడి విగ్రహం ధ్వంసంపై ఆలయ పూజారులు, స్థానిక ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట టీడీపీ నేతలు అశోక్‌గజపతిరాజు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ముందుగా ఈ ఉదయం వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రామతీర్థం ఆలయాన్ని సందర్శించి, ఘటన జరిగిన ప్రాంతాన్ని, అలాగే కొండ పక్కన ఉన్న కోనేరు ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనపై ఆలయ అర్చకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయసాయి రెడ్డి కొండకిందకు చేరుకొని కారులో వెళ్తున్న సమయంలో ఆయన వాహనంపైకి ఓ వ్యక్తి రాయి విసరడంతో వైస్సార్సీపీ, టీడీపీ శ్రేణులు పోటా పోటీగా నినాదాలతో రామతీర్థం ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. రామతీర్థం ఘటనపై వైస్సార్సీపీ, బీజేపీ, టీడీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగి దర్యాప్తు చేపడుతున్నాయి. ఈ బృందాల దర్యాప్తును డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి పర్యవేక్షిస్తున్నారు. అలాగే దేవదాయశాఖ ఆర్‌జేసీ భ్రమరాంబను ఈ ఘటన విచారణాధికారిగా ఏపీ ప్రభుత్వం నియమించింది

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 16 =