ఆక్సిజన్ ట్యాంక్ లీకేజ్ : సరఫరా నిలిచిపోవడంతో 22 మంది మృతి

22 Covid patients dead after oxygen leak at Dr Zakir Hussain, 22 Covid patients die after oxygen tank leaks, 22 Covid-19 Patients Dead after Oxygen Tanker Leakage, 22 Covid-19 Patients Dead after Oxygen Tanker Leakage at Zakir Hussain Hospital in Nashik, 22 dead after oxygen tanker leakage in Nashik hospital, Covid-19 Patients Dead after Oxygen Tanker Leakage, Maharashtra, Mango News, Nashik, Nashik 22 Covid Patients Dead After Oxygen Tanker Leak, Oxygen tanker leak in Nashik hospital kills 22, Oxygen tanker leakage, Oxygen tanker leakage in Maharashtra, Zakir Hussain Hospital, Zakir Hussain Hospital in Nashik

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరా విషయంలో పలు రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి మహరాష్ట్ర రాష్ట్రంలో బుధవారం నాడు ఘోరప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాసిక్‌లో డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఆసుపత్రి ప్రాంగణంలో ఈ మధ్యాహ్నం ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ కావడంతో ఆ ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్న 22 మంది మరణించారు.

ముందుగా ఆక్సిజన్ ట్యాంక్ నుంచి రీఫిల్లింగ్ చేస్తున్న సమయంలో ఆక్సిజన్ ట్యాంకర్ నుండి లీకేజీను గమనించారు. ఆక్సిజన్ లీకేజ్ ను పరిష్కరించే సమయంలో ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా దాదాపు 30 నిమిషాలు ఆగిపోయింది. ఈ క్రమంలో వెంటిలేటర్ పై ఆక్సిజన్ మద్దతుతో ఉన్న 22 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ సరఫరాను లీకేజ్ ప్రభావితం చేసిందని, ఈ క్రమంలోనే కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయినట్టు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించినట్లు వెల్లడించారు. మరోవైపు జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో 700 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − two =