మరో వివాదంలో ‘ఆప్’ మంత్రి సత్యేంద్ర జైన్.. ఈసారి తీహార్ జైలు సూపరింటెండెంట్‌తో సమావేశమైన వీడియో లీక్

AAP Minister Satyendra Jain'S New Video Goes Viral As Meeting Tihar Jail Superintendent,App In Another Controversy, App Minister Satyendra Jain, Tihar Jail Superintendent Meeting Video Leaked,Mango News,Mango News Telugu,Delhi Cm Aravind Kejriwal,Delhi Cm,Delhi Chief Minister Latest News And Updates,Delhi Chief Minister,Delhi Cm Kejriwal News,Delhi Deputy Chief Minister,Delhi Deputy Chief Minister Manish Sisodia,Manish Sisodia News And Live Updates,Cm Arvind Kejriwal,Bjp,AAP

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి సత్యేంద్ర జైన్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కాగా ఆయన ఇప్పటికే ఒక మనీ లాండరింగ్ కేసుకి సంబంధించి అరెస్ట్ అయ్యి తీహార్ జైలులో ఉంటున్నారు. అయితే జైలులో జైన్‌కు ప్రత్యేక సదుపాయాలు అందుతున్నట్లు తరచుగా బీజేపీ నాయకులు ఆరోపించారు. బీజేపీ నేతల ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఇటీవల ఆయన జైలు గదిలోని సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో లీకవడం కలకలం సృష్టించింది. జైలు సిబ్బంది మంత్రికి ప్రత్యేక భోజనం అందించడం, ఒక వ్యక్తి ఆయనకు మసాజ్ చేయడం వంటి వీడియోలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా మంత్రికి సంబంధించిన మరో కొత్త వీడియో బయటపడింది.

ఈసారి సత్యేంద్ర జైన్, తీహార్ జైలు సూపరింటెండెంట్‌తో సమావేశమైన వీడియో వైరల్‌గా మారింది. దీనిలో మంత్రి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్‌తో సహా కొంతమందితో సంభాషణ చేస్తూ కనిపించారు. ఇక ఈ వీడియోలో.. జైన్ తన మంచం మీద పడుకుని ఉండగా అజిత్ కుమార్ సమీపంలోని కుర్చీపై కూర్చుని సంభాషణ జరుపుతున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా మంత్రి వరుస వీడియోల వైవడంతో ఆప్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే మసాజ్ వీడియోపై స్పందించారు. మంత్రి మసాజ్ చేయించుకోవట్లేదని, అది ఫిజియోథెరపీ మాత్రమేనని వివరం ఇచ్చారు. అయితే సీఎం కేజ్రీవాల్ మీడియా సమావేశం అనంతరం, తాజాగా ఇప్పుడు ఈ వీడియో లీక్ కావడం ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − six =