ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జనవరి 30న అఖిలపక్ష సమావేశం నిర్వహణ

2021 Budget session, All-party Meeting, Budget Session, Budget session 2021, Budget session of Parliament, Mango News, Narendra Modi, Narendra Modi To Chair a All-party Meeting, Parliament Budget Session, Pm all-party meeting, PM Modi to chair all-party meeting, pm narendra modi, PM Narendra Modi To Chair a All-party Meeting

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29 న ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే జనవరి 30 న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 30 వ తేదీ ఉదయం 11.30 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశానికి లోక్ సభ, రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీల నాయకులను కేంద్రం ఆహ్వానించింది. ఈ అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనుండగా, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, పియూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి తదితరులు పాల్గొననున్నారు.

అదేరోజున ఎన్డీఏలో భాగమైన పార్టీలు కూడా విడిగా సమావేశం కానునట్టు తెలుస్తుంది. మరోవైపు ఈసారి పార్లమెంట్ సెషన్ రెండు విడతలుగా జరగనుంది. మొదటి విడతలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 15 వరకు మరియు రెండో విడతలో మార్చి 8 నుండి ఏప్రిల్ 8 వరకు జరగనుంది. రెండు విడతల్లో కలిపి మొత్తం 35 రోజులు సభ నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =