దేశంలో మంగళవారం ఉదయానికి 39,50,156 లబ్ధిదారులకు కరోనా టీకా

Corona Vaccination: More than 39.5 Lakh Beneficiaries Vaccinated in India

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 3,516 సెషన్స్ లో 1,91,313 మంది హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో ఫిబ్రవరి 2, మంగళవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 39.5 లక్షలకు పైగా (39,50,156) లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఇప్పటివరకు 72,731 కరోనా వ్యాక్సినేషన్ సెషన్లు నిర్వహించినట్టు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి 1,87,252 మంది, తెలంగాణలో 1,68,771 మంది హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేశారు.

రాష్ట్రాల వారీగా కరోనా వ్యాక్సినేషన్ వివరాలు:

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − ten =