కోవిడ్‌ టీకా ‘రక్షణ’ ఆరు నెలలే – ఏఐజీ అధ్యయనంలో వెల్లడి

30 pc of vaccinated people lose antibodies in six months, 30% individuals lose Covid vaccine-acquired immunity 6 months, 30% people lose Covid vaccine-acquired immunity, COVID 30% individuals lose vaccine-acquired immunity, COVID booster dose, Covid Vaccine Protection, Covid Vaccine Protection Wanes After 6 Months, Covid Vaccine Protection Wanes After 6 Months- AIG Study Reveals, COVID vaccine protection wanes within six months, Covid-19 Omicron Live Update, Mango News, Vaccine immunity in 30% people wanes after 6 months, When should you get COVID booster dose

కరోనా బారిన పడకుండా ఉండాలన్నా.. ఒకవేళ కరోనా సోకినా, ప్రమాదం లేకుండా ఉండాలన్నా.. మన ముందున్న ఏకైక ఆప్షన్ వ్యాక్సిన్. అయితే, ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎంతకాలం మనల్ని కాపాడగలుగుతుంది? దీనికి సమాధానం ‘ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ)’ అధ్యయనం చెప్తోంది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఆరు నెలల నుంచే రోగ నిరోధక శక్తి తగ్గిపోతోందని తెలిపింది. 30 శాతం మందిలో యాంటీబాడీల సంఖ్య పడిపోతోందని ఏఐజీ అధ్యయనంలో తేలింది. భారతీయులలో వ్యాక్సిన్‌తో వచ్చే రోగనిరోధక శక్తి ఎంత ఎక్కువ కాలం ఉంటుందన్న దానిపై ఏషియన్‌ హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌తో కలిసి ఏఐజీ ఇటీవల అధ్యయనం చేసింది. సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి బుధవారం ఈ వివరాలను వెల్లడించారు.

‘‘దేశవ్యాప్తంగా కరోనా శరవేగంగా వ్యాపిస్తోంది. అదృష్టవశాత్తూ వ్యాక్సినేషన్‌ ప్రభావం, వైవిధ్యం యొక్క అంతర్గత లక్షణం, జనాభాలో ఉన్న సహజ రోగనిరోధక శక్తి వంటి వివిధ కారణాలతో కరోనా తీవ్రత స్వల్పంగా ఉంది. అయినా కూడా ఈ అంటువ్యాధి వ్యాప్తి తక్కువగా ఉండేలా, వీలైనంత ఎక్కువ మందిని రక్షించగల మార్గాలను అన్వేషించాల్సి ఉంది. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ప్రభావం మనపై ఎంతకాలం ఉంటుందో తెలుసుకోవడానికి పరిశోధన చేశాం. అలాగే, బూస్టర్‌ డోసులు అవసరమైన నిర్దిష్ట జనాభా గుర్తించడమే మా పరిశోధన లక్ష్యం. అందుకే, పూర్తిగా రెండు డోసుల టీకాలు వేయించుకున్న 1,636 మంది ఆరోగ్య కార్యకర్తలను పరీక్షించిన మీదట ఈ అంచనాకు రాగలిగాం’’ అని డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − fourteen =