బహదూర్ పురా, ఆరాంఘర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనికీ చేసిన సీఎస్ సోమేశ్ కుమార్

aram ghar, Aramgarh-Zoo flyover, Aramgarh-Zoo flyover to be ready by Mar ’23, Aramghar Flyover, Aramghar Flyover Construction, Aramghar Flyover Construction Works, Chief Secretary inspects Bahadurpura fly-over works, Chief Secretary inspects SRDP work, City’s Second-longest Flyover, CS Somesh Kumar, CS Somesh Kumar Inspected Bahadurpura, CS Somesh Kumar Inspected Bahadurpura Aramghar Flyover Construction Works, CS Somesh Kumar inspects flyover works, Hyderabad, Hyderabad’s second-longest flyover to open in 2023, Mango News, Speed Up Aramghar-Zoo Park Flyover Works

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి)లో భాగంగా చేపట్టిన బహదూర్ పురా ఫ్లైఓవర్, ఆరాంఘర్ నుండి జూపార్క్ వరకు చేపట్టిన 4.08 కిలోమీటర్ల అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేసి, లక్ష్యానికన్నా ముందుగానే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. బహదూర్ పురా జంక్షన్ లో చేపట్టిన పలు నిర్మాణ పనులను సీఎస్ సోమేశ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనికీచేశారు. జీహెచ్ఎంసీ కమీషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఈ.ఎన్.సి జియాఉద్దీన్, ప్రాజెక్టు సిఇ దేవానంద్ హాజరైన ఈ పరిశీలన సందర్బంగా, సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రూ.69 కోట్ల వ్యయంతో చేపట్టిన 690 మీటర్ల పొడవుగల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఈ మార్చ్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ వాసులకు ముఖ్యంగా జూ పార్క్ సందర్శకులకు ఎంతగానో ఉపయోగపడే ఆరాంఘర్ నుండి జూ పార్క్ వరకు నిర్మిస్తున్న అతిపొడవైన ఫ్లై ఓవర్ పనులను కూడా నియమిత లక్ష్యానికన్నా ముందుగానే పూర్తి చేయాలన్నారు. ఈ ఆరాంఘర్-జూపార్క్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి సేకరించాల్సిన మొత్తం 163 ఆస్తులలో మరికొన్ని ఆస్తుల సేకరించాల్సి ఉన్నందున ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పనులకు అంతరాయం కలుగుతోందని ఇంజనీర్లు వివరించగా, ఫ్లైఓవర్ మౌలిక డిజైనింగ్ కు అంతరాయం కాకుండా కొన్ని ఆస్తుల సేకరణ చేయకుండానే నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. ఆరాంఘర్-జూపార్క్ ఆరులేన్ల ఫ్లైఓవర్ నిర్మాణం పనులు ఏవిధమైన అవాంతరాలు లేకుండా జరిగేందుకు విధ్యుత్ పంపిణి సంస్థ, అర్బన్ బయోడైవర్సిటీ, జలమండలి తదితర విభాగాలతో సమన్వయంతో పని చేయాలని సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఈ పర్యటనలో చార్మినార్ జోనల్ కమీషనర్ అశోక్ సామ్రాట్, ఎస్.ఈ దత్తు పంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =