ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 6 స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

ECI Released Bye-election Schedule for 5 Assembly 1 Parliamentary Constituency in UP Odisha Rajasthan Bihar Chhattisgarh, ECI Released Bye-election Schedule for 5 Assembly, 1 Parliamentary Constituency in UP, Odisha Bye-election , Rajasthan Bye-election, Bihar Bye-election, Chhattisgarh Bye-election, UP, Odisha, Rajasthan, Bihar, Chhattisgarh, EC Released Notification, EC By-Election Notification, Election Comission Of India, Election Comission Latest News And Updates

దేశంలోని ఐదు రాష్ట్రాలలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఓ పార్లమెంట్ స్థానంలో ఉపఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం(ఈసీ) శనివారం విడుద‌ల చేసింది. ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మైన్ పూరి లోక్‌సభ స్థానంలో, రాంపూర్ అసెంబ్లీ స్థానంలో మరియు ఒడిశాలోని పదంపూర్, బీహార్ లో కురహాని, ఛత్తీస్ గడ్ లో భానుప్రతాపూర్, రాజస్థాన్ లోని సర్దర్శహర్ అసెంబ్లీ స్థానాల్లో డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ జరగనుందని ఈసీ ప్రకటించింది. కాగా ఈ ఐదు రాష్ట్రాల్లో ఉపఎన్నికల కౌంటింగ్ పక్రియను హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పలితాలతో పాటుగా డిసెంబర్ 8న చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నట్టు ఈసీ వెల్లడించింది.

ఐదు రాష్ట్రాల్లో ఉపఎన్నికల షెడ్యూల్ వివరాలు:

  • గెజిట్ నోటిఫికేషన్‌ జారీ తేదీ: నవంబర్ 10
  • నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ: నవంబర్ 17
  • నామినేషన్ల పరిశీలన: నవంబర్ 18
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 21
  • పోలింగ్ తేదీ: డిసెంబర్ 5
  • ఓట్ల లెక్కింపు పక్రియ: డిసెంబర్ 8.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =