రైతుల ఆందోళన: కేంద్రంతో జరుగుతున్న పదో రౌండ్‌ చర్చలు

Farmers Protest: 10th Round of Talks Between Farmers Unions Leaders and Union Ministers Underway

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. చట్టాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఇప్పటివరకు 9 రౌండ్లలో జరిగిన చర్చలు పూర్తిస్థాయిలో ఫలప్రదం కాలేదు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో 10వ రౌండ్ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశానికి వివిధ రైతు సంఘాల నేత‌లు, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్ హాజరయ్యారు. ముందుగా రైతులతో 10 వ రౌండ్ చర్చలు మంగళవారం నాడే జరగాల్సిఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల బుధవారానికి వాయిదా వేసినట్టు వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

గత చర్చల సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, కనీస మద్దతు ధరపై చట్టం చేసే అంశాలపైనే రైతు సంఘాల నాయకులు పట్టుబట్టారు. పదో రౌండ్ చర్చల్లో అయిన రైతులు ఆందోళన విరమించే దిశగా కేంద్రం ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటుందా లేదా అనే అంశం తేలాల్సి ఉంది. మరోవైపు డిమాండ్స్ నెరవేరకపోతే శాంతిపూర్వక వాతావరణంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్లతో ‘కిసాన్ గణతంత్ర పరేడ్’ నిర్వహించేందుకు రైతు సంఘాలు సిద్ధమవుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =