శ్రీలంక పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం, తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్‌

India External Affairs Minister S Jaishankar Worries Over Sri Lanka Crisis in All-Party Meet, EAM S Jaishankar Worries Over Sri Lanka Crisis in All-Party Meet, Worries Over Sri Lanka Crisis in All-Party Meet, All-Party Meet, Sri Lanka Crisis, India External Affairs Minister S Jaishankar, India External Affairs Minister, Minister S Jaishankar, EAM S Jaishankar, S Jaishankar, Sri Lanka Economic Crisis News, Sri Lanka Economic Crisis Latest News, Sri Lanka Economic Crisis Latest Updates, Sri Lanka Economic Crisis Live Updates, Mango News, Mango News Telugu,

శ్రీలంక దేశంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దీనికి భారత విదేశాంగ మంత్రి జై ఎస్‌ జైశంకర్‌ అధ్యక్షత వహించగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి సహా వివిధ రాజకీయ పక్షాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ నేతలు పి చిదంబరం, మాణిక్కం ఠాగూర్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, ద్రవిడ మున్నేట్ర కజగం నేత చెందిన టీఆర్ బాలు, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్, అన్నాడీఎంకే నేత ఎం తంబిదురై, తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగత్ రాయ్, టీఆర్ఎస్ నేత కేశవ రావు, వైసీపీ నేత విజయసాయి రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆల్-పార్టీ మీట్‌లో కేంద్ర మంత్రి జైశంకర్‌ మాట్లాడుతూ.. శ్రీలంకలో పరిస్థితులు విషమంగా ఉన్నాయని, దీనిపై భారత్‌ ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుందా అని తరచుగా ప్రజలు నన్ను అడుగుతున్నారని ఆయన తెలిపారు. ఈ అంశం మన పొరుగు దేశానికి సంబంధించినదే కాబట్టి, దాని పర్యవసానాలపై భారతదేశానికి సహజంగానే ఆందోళన ఉంటుందని మంత్రి అన్నారు. శ్రీలంకలో ప్రస్తుతం మనం చూస్తున్నది చాలా తీవ్రమైన సంక్షోభం.. అందుకే దేశంలోని అన్ని పార్టీలకు, నాయకులకు దీనిపై పూర్తి సమాచారం ఇవ్వడానికే ఈరోజు సమావేశం ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే శ్రీలంకకు వివిధ మార్గాల ద్వారా భారత ప్రభుత్వం సహాయాన్ని అందజేస్తోందని, దేశంలో ప్రజాస్వామ్యం, స్థిరత్వం మరియు ఆర్థిక పునరుద్ధరణకు తమ మద్దతు కొనసాగుతుందని భారత్ శ్రీలంకకు హామీ ఇచ్చిందని ఆయన వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =