నాలుగో టెస్టులో ఘన విజయంతో ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్

Highlights India vs England 4th Test, ICC World Test Championship Final, India 294-7 Rishabh Pant Hits Century, India beat England to win series 3-1, India vs England, India Vs England 4th Test, India Vs England 4th Test Day 2, India Vs England 4th Test Day 2 Stumps, India vs England 4th Test News, India vs England Live Cricket Score 4th Test, India vs England Live Cricket Score 4th Test Day 2, India vs England Match, India vs England Match updates, India Wins Test Series with 3-1, India Wins Test Series with 3-1 Against England, Mango News

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ జట్టు ఇన్నింగ్ ‌25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ ను భారత్ 3-1 తో కైవసం చేసుకుంది. ఈ సంచలన విజయంతో భారత్ ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. లార్డ్స్ మైదానంలో జూన్ 18-22 మధ్య జరిగే ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో భారత్ తలపడనుంది.

ముందుగా 294/7 వద్ద మూడోరోజు తోలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్ జట్టు 365 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ 96 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అక్షర్‌ పటేల్, ఇషాంత్ శర్మ‌, మహ్మద్ సిరాజ్‌ వెంటవెంటనే అవుట్ అవ్వడంతో వాషింగ్టన్ సుందర్‌ త్రుటిలో టెస్టుల్లో తొలి శతకాన్ని సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 135 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌ లో 10 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్ లో ఓపెనర్‌ జాక్‌ క్రాలీ, జానీ బెయిర్‌ స్టో పెవిలియన్ బాటపట్టారు. ఆ తర్వాత అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ ద్వయం దాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ పూర్తిగా చేతులెత్తశారు. కెప్టెన్ జో రూట్ (30), డేనియల్ లారెన్స్ (50) మాత్రమే పరుగులు సాధించగలిగారు. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్ ఐదు, అశ్విన్‌ ఐదు వికెట్లు పడగట్టారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 160 పరుగుల ఆధిక్యం రాగా, రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 135 పరుగులే చేయడంతో ఇన్నింగ్స్ 25 పరుగులతో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. మూడోదైనా పింక్ బాల్ టెస్ట్ రెండు రోజులకు ముగియగా, నాలుగో టెస్ట్ మూడో రోజున ముగిసింది.

ఈ టెస్టులో బౌలింగ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో 30వ సారి ఐదు వికెట్లను‌ దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రిషభ్ పంత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
కు ఎంపికవగా, ఈ సిరీస్ ఆసాంతం బౌలింగ్ తో పాటుగా, బ్యాటింగ్ లోనూ రాణించిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.

భారత్–ఇంగ్లాండ్ నాలుగో టెస్టు వివరాలు:

ఇంగ్లాండ్ తోలి ఇన్నింగ్స్: 205-10

  • బెన్ స్టోక్స్ (55), డేనియల్ లారెన్స్ (46)‌
  • అక్షర్ పటేల్ 4/68, అశ్విన్ 3/47

భారత్ తోలి ఇన్నింగ్స్: 365-10

  • రిషభ్ పంత్ (101), వాషింగ్టన్ సుందర్ (96*)
  • బెన్ స్టోక్స్ 4/89, జేమ్స్ ఆండర్సన్ 3/44

ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్: 135-10

  • డేనియల్ లారెన్స్ (50), జో రూట్ (30)
  • అక్షర్ పటేల్ 5/48, అశ్విన్ 5/47
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =