ట్విట్టర్ కొత్త సీఈఓ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం, ఇకపై ట్విట్టర్‌లో బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు ఛార్జ్

Twitter New CEO Elon Musk Says Twitter will Charge 8 Dollars Per Month For Blue Tick,Twitter New CEO Key Decision By Elon Musk, $8 Month Charge For Blue Tick On Twitter, Twitter Verification Blue Tick To Cost $8, Announces New Boss Elon Musk, Elon Musk Takes Control of Twitter, Terminates Top Executives, CEO Parag Agrawal, CFO Ned Segal, Mango News, Mango News Telugu, Twitter Ex CEO Parag Agrawal, Twitter Ex CFO Ned Segal, Elon Musk Buys Twitter, Elon Musk Twitter Takeover, Elon Musk Latest News And Updates, Elon Musk Twitter Live Updates, Elon Musk Tesla, Elon Musk News And Updates

బిలియనీర్, టెస్లా కంపెనీ అధిపతి, ట్విట్టర్ కొత్త సీఈఓ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ వినియోగదారుల ప్రొఫైల్ ధృవీకరించబడిందని సూచించే వారి అకౌంట్ పేరు పక్కన ఉన్న బ్లూ టిక్‌కు నెలకు 8 డాలర్లు (దాదాపు రూ. 660) ఛార్జ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎలాన్ మస్క్ మంగళవారం ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం ఉచితం అయిన ఈ బ్లూ టిక్ ఫీచర్ కోసం ఇకపై రుసుం వసూలు చేయబడతుందని స్పష్టం చేశారు. అయితే దేశాన్ని బట్టి ఈ ధరలో స్వల్ప మార్పులు ఉంటాయని తెలిపారు. అలాగే బ్లూ టిక్ కోసం చెల్లించే వినియోగదారులు ఇతరులపై కొన్ని ప్రయోజనాలను పొందుతారని చెప్పారు. పబ్లిక్ ఫిగర్ అయిన వారి పేరు క్రింద సెకండరీ ట్యాగ్ ఉంటుందని, అలాగే ఎక్కువ నిడివి కలిగిన ఆడియో, వీడియోలను పోస్ట్ చేయొచ్చని మస్క్ చెప్పారు. ఇంకా రిప్లై, మెన్షన్, సెర్చ్ వంటి ఫీచర్లలో ప్రాధాన్యత ఉంటుందని, స్పామ్ నివారించడానికి ఇవి అవసరమని మస్క్ వెల్లడించారు.

ఈ నిర్ణయం ద్వారా కంటెంట్ క్రియేటర్‌లకు రివార్డ్‌లు అందించేందుకు ట్విటర్‌కు ఆదాయ మార్గం లభిస్తుందని ఆయన తెలిపారు. కాగా ప్రకటనలపై ట్విట్టర్ ఆధారపడటాన్ని తగ్గించాలనుకుంటున్నట్లు మస్క్ ఇంతకు ముందు చెప్పారు. ప్రముఖ రచయిత స్టీఫెన్ కింగ్ చేసిన ట్వీట్‌కు సమాధానంగా బ్లూ టిక్‌కు 8 డాలర్లు వసూలు చేయాలనే ఆలోచనను మస్క్ వెలిబుచ్చారు. ఇక మస్క్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాని డైరెక్టర్ల బోర్డు రద్దు చేయబడిందని ట్విట్టర్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపిన ఒక రోజు తర్వాత బ్లూ టిక్ సిస్టమ్‌ను మార్చాలనే నిర్ణయం వెలువడటం గమనార్హం. కాగా మస్క్ అక్టోబర్ 28న 44 బిలియన్ డాలర్ల (రూ. 3,36,910 కోట్లకు పైగా) భారీ మొత్తంతో ట్విట్టర్‌ టేకోవర్‌ను పూర్తి చేశారు.

ఇక మస్క్ నిర్ణయం మిగిలిన కంపెనీలను ఆలోచనలో పడేసింది. ప్రకటనకర్తలపై ఆధారపడటాన్ని తగ్గించాలనే ఆయన నిర్ణయం అనేక కంపెనీలలో ఆందోళనలను పెంచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రపంచంలోని అతిపెద్ద అడ్వర్టైజింగ్ దిగ్గజాలలో ఒకటైన ఇంటర్‌పబ్లిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ప్లాట్‌ఫారమ్‌పై నమ్మకం మరియు భద్రతను నిర్ధారించడానికి సోషల్ మీడియా సంస్థ యొక్క ప్రణాళికలపై మరింత స్పష్టత అవసరమని, ట్విట్టర్ ప్రకటనలను ఒక వారం పాటు నిలిపివేయమని తన ఖాతాదారులకు సూచించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగానే ఎలాన్ మస్క్ నిర్ణయం వెలువడినట్లు భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 8 =