గూగుల్ మ్యాప్స్‌లో ఏఐ టెక్నాలజీ ఎంటర్

Generative AI feature in Maps, Enter AI technology in Google Maps,Google Maps,AI technology,AI feature, bots, new technology, new features, more life features, Latest updates, Latest technology, global expansion, artificial intelligence, Mango News Telugu, Mango News
Generative AI feature in Maps, Enter AI technology in Google Maps,Google Maps,AI technology,AI feature

ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అన్ని రంగాల్లో విస్తరిస్తూ మనుషులకు పెద్ద సవాల్‌ను విసురుతోంది. ఇప్పటి వరకూ అన్ని యాప్స్, అన్ని రంగాలలో ఎంటర్ అవుతున్న ఏఐ.. గూగుల్‌ మ్యాప్స్‌లోనూ ఎంటరయిపోయింది. తాజాగా ఏఐ టెక్నాలజీని గూగుల్ మ్యాప్స్‌లో ఉపయోగిస్తూ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.

ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో వినియోగదారులు కొత్త ప్రదేశాలకు చెందిన అడ్రస్‌లకు ఇకపై ఈజీగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. మెదటగా ఈ ఏఐ ఫీచర్‌ను అమెరికాలోని గూగుల్ మ్యాప్స్ వాడే   వినియోగదారులకు మ్యాప్స్‌లో జనరేటివ్ ఏఐ ఫీచర్లను అందించనున్నట్లు ప్రకటించింది. దీనిని  ఒకటి రెండు రోజుల్లో అమెరికాలోని ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.

ఈ కొత్త ఏఐ ఫీచర్‌ సహాయంతో మ్యాప్స్‌లో కొత్తకొత్త ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలు మాత్రమే కాదు..రివ్యూలు, అక్కడి వాతావరణానికి  సంబంధించిన వివరాల గురించి  కచ్చితమైన ఇన్ఫర్మేషన్‌ను ఏఐ అందిస్తుంది. అంటే ఎవరైనా ఒక  కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు.. అక్కడ ఏదైనా ఫేమస్ అని తెలిసి ఒక వస్తువు కొనాలనుకుంటే..ఆ  వస్తువుకు సంబంధించిన అంశాన్ని మ్యాప్స్‌లో  ఎంటర్‌ చేయగానే వారికి దగ్గరల్లో ఆ వస్తువులు ఎక్కడ  దొరుకుతాయి? వాటి ఫోటోలు, రేటింగ్‌లు, దగ్గరలోని ఇతర వ్యాపారాలు, స్థలాల గురించి వివరంగా పూర్తి సమాచారాన్ని చూపిస్తుంది.

అంతేకాదు  వారికి ఇష్టమైన ఆహారం కోసం మ్యాప్స్‌లో టైప్‌ చేయగానే వెంటనే ఆ ఫుడ్‌ ఎక్కడ దొరుకుతుది. ఆ ఫుడ్ కోసం ఆ ప్రాంతానికి  వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది వంటి  ఫుడ్‌ గురించి పూర్తి సమాచారంతో పాటు..దానికి ప్రాంతంలో గల రేటింగ్‌ అన్నింటిని కూడా ఏఐ టెక్నాలజీ‌తో ఉన్న కొత్త ఫీచర్‌ అందిస్తుంది. ఇప్పుడు ఒక్క అమెరికాలో మాత్రమే ఉన్నా..  ప్రపంచ వ్యాప్తంగా త్వరలోనే  ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − six =