ఏఐ సహాయంతో ఒక్కటైన జంట

Chat GPT,AI,Tinder,Marriage with the help of Chat GPT,A couple, help of AI, Socil Media, AI Bat, Tindor, dating App, Artificial Intelligence, virtual reality, socisl media, Mango News Telugu, Mango News
Chat GPT,AI,Tinder,Marriage with the help of Chat GPT,A couple, help of AI, Socil Media, AI Bat, Tindor, dating App

మన జీవితాలలో ఎప్పడయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించిందో అప్పుడే జనాల్లో ఏదో తెలియని ఆందోళన మొదలయింది.ఎన్నో ఉద్యోగాలకు ఎసరు పెట్టడంతో పాటు.. వ్యక్తిగత జీవితాలను కకావికలం చేసే డీప్ ఫేక్ వీడియో వంటివి ఎంటర్ అవడంతో ఫ్యూచర్ ఇంకెలా ఉంటుందోనన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఏది అయినా మనం వినియోగించే పద్ధతి బట్టే ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. విజ్ఞానదాయకమైన ఇలాంటివాటిన వినోదం , చెడుదారులు పట్టడానికి ఏఐని దుర్వినియోగపరచడం కంటే..మంచి కోసం ఉపయోగిస్తే మంచే జరుగుతుందన్న విషయం  రుజువయింది.

రష్యాలో చాట్ జీపీటీ సాయంతో ఒక జంట ఒకటయిన  సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఒక అబ్బాయి, తనకిష్టమయిన అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చాట్‌ జీపీటీని ఉపయోగించాడట. AI ద్వారా తాను భార్యను ఎంచుకున్నాడట. రష్యన్ వార్తా సంస్థ ఆర్ఐఏ నోవోస్టి తెలిపిన దాని ప్రకారం 23 ఏళ్ల సాఫ్ట్‌వేర్ డెవలపర్ అలెగ్జాండర్ జాడాన్.. టిండర్ వంటి డేటింగ్ యాప్‌లలో..చాట్ జీపీటీ , అనేక ఇతర ఏఐ బాట్‌లలో తన పార్టనర్ కోసం  వెతికాడట. చివరకు చాట్ జీపీటీ ద్వారా అతను తనకు ఉన్న క్వాలిటీస్ తో ఉన్న అమ్మాయిని వెతకగలిగాడట.

రష్యన్ మీడియాతో మాట్లాడిన అలగ్జాండ్ జాడాన్.. ఏఐ సహాయంతో తనకు వచ్చిన ప్రపోజల్స్ లో మొదట 500 మందికి పైగా అమ్మాయిలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత వాళ్లను మళ్లీ ఫిల్టర్ చేసి 50 మందిని లిస్ట్‌లో ఉంచాడట. అలా అలా  ఫిల్టర్లు చేస్తూ చివరికి ..ఏఐ సాయంతో కరీనా అనే మహిళను సెలక్ట్ చేసుకోవడమే కాదు..తననే  పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు.

అలా ఏఐతో సాయంతో ఎంచుకున్న అమ్మాయితో.. ముందుగా ఫోన్లో మాట్లాడి తర్వాత డైరక్టుగా వెళ్లి తనతో మాట్లాడినప్పుడు పెద్దగా ఇబ్బంది కలగలేదని జాడాన్ అన్నాడు. ఏఐ వల్ల తన ఫిల్టరింగ్ ఈజీగా అవడంతో.. తాను ఆమెతో మాట్లాడిన వెంటనే ఇంప్రెస్ అయి.. వెంటనే ఆమెకు ప్రపోజ్ చేయడం, ఇద్దరం పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయని సంతోషంగా చెప్పుకొచ్చాడు.అయితే ఇప్పటికైనా లైఫ్‌లో జరిగే  ఇలాంటి మంచి విషయాలకు మాత్రమే ఏఐని వాడితే మంచి ఫలితాలు పొందొచ్చని..లేదంటే ఫ్యూచరే ఇబ్బందికరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =