రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ తెలుసా..?

Do You Know The Love Story Of Revanth Reddy,Do You Know The Love Story,Love Story Of Revanth Reddy,Revanth Reddy Love Story,Revanth reddy, love story, telangana congress,Mango News,Mango News Telugu,Revanth Reddys Unheard Love Story,Telangana Congress Chief Minister,Revanth Reddy Love Story Unknown Facts,Revanth reddy Latest News,Revanth reddy Latest Updates,Revanth reddy Live News
Revanth reddy, Revanth reddy, love story, telangana congress,

ఎటువంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా..  జీరో నుంచి సీఎం స్థాయికి ఎదిగారు అనుముల రేవంత్ రెడ్డి. పార్టీలు దూరంపెట్టినప్పటికీ.. ఇండిపెండెంట్‌గా నిలబడి తానేంటో నిరూపించుకున్నారు. స్వతంత్రంగా పోటీ చేసి జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా గెలుపొందారు. తన ముక్కుసూటి వ్యక్తిత్వంతో తెలంగాణ రాజకీయాల్లో రెబల్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయిందనుకున్న సమయంలో ఆ పార్టీ పగ్గాలు చేజిక్కించుకున్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు దిగ్గజ పార్టీలను మట్టికరిపించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు.

అయితే రేవంత్ రెడ్డి పొలిటికల్ లైఫ్ గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ఇంటర్మీడియట్‌లోనే రేవంత్ రెడ్డి లవ్ స్టోరీని నడిపారు. సినిమా స్టోరీలకు ఏమాత్రం తీసిపోకుండా.. ట్విస్టుల మీద ట్విస్టులతో ఉంటుంది రేవంత్ లవ్ స్టోరీ. మొదట్లో పెద్దలు వారి ప్రేమను అంగీకరించకపోయినప్పటికీ.. పెళ్లికి నిరాకరించినప్పటికీ పట్టు వదలకుండా.. పోరాడి ప్రేమించిన గీతారెడ్డిని పెళ్లి చేసుకున్నారు రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడే నాగార్జున సాగర్‌లో గీతారెడ్డిని చూసి మనసు పారేసుకున్నారు. అక్కడ వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. క్రమక్రమంగా అది ప్రేమగా మారింది. మొదట్లో రేవంత్ రెడ్డే.. గీతా రెడ్డికి తన ప్రేమ విషయం తెలియజేశారట. అయితే రేవంత్ రెడ్డి తీరు, వ్యక్తిత్తం, ముక్కుసూటి తనం నచ్చటంతో గీతా రెడ్డి కూడా ఓకే చెప్పేశారట. అయితే ఇద్దరు ప్రేమించుకుంటున్నప్పటికీ.. పెళ్లి చేసుకోవడానికి మాత్రం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది.

అయితే గీతారెడ్డి సంపన్న కుటుంబం నుంచి వస్తే.. రేవంత్ రెడ్డి సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. అందుకే గీతా రెడ్డి తండ్రి వారి పెళ్లికి అంగీకరించలేదు. పైగా రేవంత్ రెడ్డికి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో గీతారెడ్డిని ఢిల్లీకి పంపించారు. ముందు నిరాశ పడిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత వెనక్కి తగ్గకుండా పోరాడారు. పెద్దలను ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డారు. చివరికి గీతారెడ్డి తల్లిదండ్రుల అభ్యంతరాలను అధిగమించి.. పెళ్లికి ఒప్పించారు. 1992లో గీతారెడ్డిని రేవంత్ రెడ్డి వివాహమాడారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 7 =