టీటీడీపీకి షాక్.. గుడ్ బై చెప్పిన కాసాని

A Shock to Ttdp Kasani Said Goodbye,a Shock to TTDP Kasani,Ttdp Kasani Said Goodbye,Mango News,Mango News Telugu,Upset over Naidus Move,Kasani Gnaneshwar, Telangana Telugu Desam Party, TTDP, Chandrababu Naidu,Big Shock to Chandrababu,TDP Kasani Gnaneshwar,Kasani Gnaneshwar Good Bye to TDP,Kasani Resigns from TDP,Kasani Gnaneshwar Latest News,Kasani Gnaneshwar Latest Updates,Telangana Telugu Desam Party Latest News,Telangana Telugu Desam Party Latest Updates,Chandrababu Naidu Latest News,Chandrababu Naidu Latest Updates
kasani gnaneshwar, telangana telugu desam party, ttdp, chandrababu naidu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఊహాగానాలే నిజమయ్యాయి. కొద్దిరోజులుగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ.. కాసాని తన పదవికి, పార్టీ సభ్యత్వానికి కాసాని రాజీనామా చేశారు. తెలంగాణలో పోటీ చేయొద్దని అధిష్టానం తీసుకున్న నిర్ణయం వల్లే.. తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు.

నిజానికి తెలంగాణలో టీడీపీ కనుమరుగైపోయింది. పూర్తిగా పతనమయిపోయింది. గతంలో మాజీ మంత్రి ఎల్ రమణ.. తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన రాజీనామా చేశాక.. పార్టీ పాతాళంలోకి వెళ్లిపోయింది. తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందనుకున్న సమయంలో కాసాని ఎంట్రీ ఇచ్చారు. పార్టీ పగ్గాలను చేజిక్కించుకున్నారు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు. కనుమరుగైపోయిన పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చారు. పార్టీ బలోపేతం చేసేందుకు సొంత సొమ్ము కూడా ఖర్చు చేశారు. పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు.

అసెంబ్లీ ఎన్నికలకు కూడా కాసాని సిద్ధమయ్యారు. తెలంగాణలో మొత్తం 85 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత జైలులో ఉన్న చంద్రబాబుతో కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. ఆ సమయంలో చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఆదేశించారు. దీంతో అప్పటి వరకు ఎన్నికల్లో పోటీపై కోటి ఆశలు పెట్టుకున్న కాసాని తీవ్ర మనస్థాపానికి0 గురయ్యారు. తన ఆశలన్నీ నిరాశలు కావడంతో.. పార్టీకి రాజీనామా చేసేశారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి తన రాజీనామా లేఖను పంపించారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని తీసుకున్న నిర్ణయం.. పార్టీ ఉనికిని మరోసారి ప్రశ్నార్థకం చేసేదిగా ఉందని కాసాని లేఖలో పేర్కొన్నారు. ఆ నిర్ణయం తనొక్కడికే కాకుండా.. పార్టీ శ్రేణులందరికీ తీవ్ర మనోవేధనకు గురిచేస్తోందని అన్నారు. అత్యంత కీలకమైన సమయంలో ఎన్నికల నుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. వామపక్షాలు, బీఎస్పీ, జనసేన వంటి పార్టీలు కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. అటువంటిది 40 ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండడం.. సహేతుకమైన నిర్ణయం కాదని కాసాని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. కాసాని నెక్ట్స్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు?.. ఏ పార్టీలో చేరబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజులుగా కాసాని గులాబీ పార్టీలో చేరబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే కాసాని గులాబీ కండువా కప్పుకుంటారా? లేదా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − three =