తెలంగాణలో నేడు, రేపు కరోనా వ్యాక్సినేషన్‌ బంద్, సోమవారం నుంచి కొనసాగింపు

Covid Vaccination Special Drive in Telangana will not be Conducted Today and Tomorrow,Mango News,Mango News Telugu,Telangana Stops Second Dose Vaccination Drive On May 15,Covid-19 News Updates,Covid Vaccination Special Drive,Covid,Covid-19,Covid-19 In Telangana,Covid-19 Latest Updates,Telangana Covid-19 Updates,Coronavirus,Coronavirus In Telangana,Telangana Coronavirus Latest News,Telangana Covid-19 Vaccination,Telangana Covid Vaccination Special Drive,Covid Vaccination Special Drive in Telangana,Telangana Covid Vaccination Special Drive Stops,Telangana Covid Vaccination will not be Conducted Today and Tomorrow,No vaccination in Telangana today,No Covid vaccination in Telangana today

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ అందించే విధంగా స్పెషల్ డ్రైవ్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ ను మే 15 శనివారం, మే 16 ఆదివారం నాడు నిలిపివేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

“కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ కు సంబంధించి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి. కేంద్రప్రభుత్వం తాజాగా కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధిని 6-8 వారాల నుండి 12-16 వారాలకు పెంచింది. దీని ప్రకారం కోవిన్ పోర్టల్‌లో మార్పులు చేయబడ్డాయి, అంటే 12 వారాల తర్వాత మాత్రమే కోవిషీల్డ్ రెండవ డోస్ ఇవ్వడం సాధ్యమవుతుంది. ఈ మార్పుల దృష్ట్యా, ప్రస్తుతం రాష్ట్ర ఆరోగ్య శాఖ చేపడుతున్న 45 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గలవారికి రెండవ డోస్ వ్యాక్సిన్ ఇచ్చే స్పెషల్ డ్రైవ్ శనివారం మరియు ఆదివారం నిర్వహించబడదు. వ్యాక్సిన్ కు అర్హత కలిగిన లబ్ధిదారుల వివరాలు మరియు పద్దతిని తెలియజేసి మే 17, సోమవారం నుంచి తిరిగి కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభించబడుతుంది” అని ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + sixteen =