తెలంగాణ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాల కల్పనకై తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ సమావేశం

CS Somesh Kumar held Meeting with Officials over Employment Opportunities at Abroad to Telangana Youth, CS Somesh Kumar, CS Somesh Kumar Held Meeting, TS CS Somesh Meeting over Employment Opportunities Abroad, Mango News, Mango News Telugu, Employment Opportunities at Abroad, Telangana Youth Employment Opportunities at Abroad, Telangana Youth Employment Opportunities, CS Somesh Kumar Meeting, Telangana CS Somesh Kumar Meeting, Telangana CS Somesh Kumar, Telangana Latest News And Updates

తెలంగాణ రాష్ట్రంలోని యువతకు విదేశాలలో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం, విదేశాలలో ఉద్యోగ మార్కెట్‌ను మెరుగుపరచుటకు తెలంగాణ ఓవర్ సీస్ మ్యాన్ పవర్ కంపెనీకి (TOMCOM) ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్, అడ్వైజరీ కౌన్సిల్ ను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.

విదేశాల్లో ఎక్కువ మంది నర్సింగ్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా వ్యూహాన్ని రూపొందించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను సీఎస్ కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో నర్సింగ్‌ కోర్సు చదువుతున్న విద్యార్థులందరికీ మోటివేషనల్‌ క్యాంపులు నిర్వహించి, విదేశాల్లో ఉద్యోగావకాశాల గురించి వివరించాలని ఆదేశించారు. అదేవిధంగా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న టెక్నికల్ కోర్సుల జాబితాను షార్ట్‌ లిస్ట్ రూపొందించాలన్నారు. విద్యార్థులకు ప్రాథమిక పాఠ్యాంశాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీషులో బోధించేందుకు కోర్సులతో పాటు రిసోర్స్ పర్సన్‌లను గుర్తించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలను వినియోగించుకోవడంతోపాటు బలోపేతం చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. సూచించారు.

ఈ సమావేశంలో కార్మిక, ఉపాది శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్‌ నవీన్‌ మిట్టల్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎం ఓఎస్డీ డా.గంగాధర్, కార్మిక శాఖ కమీషనర్ అహ్మద్ నదీమ్, ఇండస్ట్రీస్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 17 =