రేపు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాథ్‌ ల్యాబ్‌ను ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌ రావు

Cath Lab at Khammam, Cath Lab at Khammam Govt District Hospital, Cath lab trauma care unit to be inaugurated, Harish Rao, Harish Rao inaugurates high-end CATH lab, Harish Rao to Inaugurate Cath Lab at Khammam Govt District, Khammam, Khammam Govt District Hospital, Mango News, Minister Harish Rao, Minister Harish Rao to Inaugurate Cath Lab at Khammam Govt District Hospital, Minister Harish Rao to Inaugurate Cath Lab at Khammam Govt District Hospital Tomorrow, Works on Cath lab at district hospital

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు రేపు (జనవరి 28, శుక్రవారం) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేస్తూ, “మన ప్రజలకు ప్రపంచ స్థాయి ఆరోగ్య సౌకర్యాన్ని అందించాలనే సీఎం కేసీఆర్ విజన్ ను నెరవేర్చే దిశగా మనం మరో అడుగు వేస్తున్నాము. రేపు ఖమ్మం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పేద రోగుల కోసం కార్డియాక్ కాథెటరైజేషన్ లాబొరేటరీ (క్యాథ్ ల్యాబ్) ప్రారంభోత్సవానికి వస్తున్నాను” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొననున్నారు. అలాగే మధిరలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి కూడా మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ శంకుస్థాపన చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 4 =