ఐపీఎల్‌-2021 ‌నిర్వహణ వేదికల్లో హైదరాబాద్ ను చేర్చండి : మంత్రి కేటీఆర్

Azharuddin bats for holding IPL matches in Hyd, Include Hyderabad as IPL venue, Include Hyderabad as One of the Venues for Upcoming IPL Season, IPL Season, KTR Appeal to BCCI to Include Hyderabad as One of the Venues for Upcoming IPL, KTR Appeal to BCCI to Include Hyderabad as One of the Venues for Upcoming IPL Season, KTR appeals to BCCI, Mango News, Minister KTR, Minister KTR Appeal to BCCI to Include Hyderabad, Upcoming IPL Season

త్వరలో జరగబోయే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో హైదరాబాద్ ను ఒక వేదికగా చేర్చాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆఫీసు బేరర్‌ లకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ సమర్థవంతమైన కరోనా నియంత్రణ చర్యల వలన భారతదేశంలోని అన్ని మెట్రో నగరాల్లో కంటే హైదరాబాద్ నగరంలోనే తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయని మరియు ప్రభుత్వం నుండి ఐపీఎల్ మ్యాచుల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల మద్దతు లభిస్తుందని భరోసా ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ముందుగా కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశంలో ఐపీఎల్ 14 నిర్వహణను కొన్ని నగరాలలోనే చేపట్టాలని బీసీసీఐ భావిస్తుంది. ముంబయి, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలనే ఐపీఎల్ నిర్వహణ కోసం ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ జాబితాలో హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంను కూడా ఒక వేదికగా చేర్చాలని మంత్రి కేటీఆర్ బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + nineteen =