దావోస్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన మంత్రి కేటీఆర్

KTR Latest News, KTR Meeting With Global Leaders in Davos, Mango News Telugu, Minister KTR Meeting With Global Leaders, Political Updates 2020, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, WEF in Davos
  • తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను వివరించిన మంత్రి కేటీఆర్
  • దావోస్ లో సీఎన్బీసీ టివి 18 మరియు సీఐఐ సంయుక్తంగా “ఇండియా- ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ నేషన్” అనే అంశంపై నిర్వహించిన ఫ్యానల్ డిస్కషన్లో పాల్గోన్న మంత్రి కేటీఆర్
  • భారత్, తెలంగాణల్లో అద్బుతమైన వ్యాపార అవకాశాలున్నాయన్న కేటీఆర్
  • పలు ప్రముఖ కంపెనీల సీనియర్ నాయకత్వంతో సమావేశాలు

తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు జనవరి 20న స్విట్జర్లాండ్లోని దావోస్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. సదస్సులో భాగంగా జనవరి 21, మంగళవారం నాడు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. దావోస్ లో సీఎన్బీసీ టివి 18 మరియు సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన ఫ్యానల్ డిస్కషన్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఇండియా ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ నేషన్ అంశంపై నిర్వహించిన ఈ చర్చలో పాల్గోన్న మంత్రి కేటీఆర్ ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో అద్భుతమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 20 నుంచి 40 సంవత్సరాల వయస్సులో ఉన్న యువత భారత దేశానికి అద్భుతమైన బలమన్నారు. ఈ చర్చలో భాగంగా తెలంగాణలోని పెట్టుబడుల అవకాశాలు, ఇన్నోవేషన్ రంగం గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ర్టం ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తున్నదని, ఇప్పటికే ఆపిల్, గూగుల్, పేస్ బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రపంచ టాప్ 5 దిగ్గజ కంపెనీలు తమ కేంద్ర కార్యాలయాల తర్వాత అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నాయని తెలిపారు.

నివాసం ఉండేందుకు హైదరాబాద్ నగరం అత్యుత్తమమైన నగరమని మెర్సర్ గత ఐదు సంవత్సరాలుగా గుర్తిస్తూ వస్తుందన్నారు. దీంతోపాటు ప్రపంచంలోని 130 నగరాల్లో అత్యంత డైనమిక్ నగరంగా హైదరాబాద్ ని జేఎల్ఎల్ గుర్తించింది అన్నారు. ఈవోడీబీతో పాటు కాస్ట్ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ తగ్గింపు, క్వాలిటీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్ మెరుగుపర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు మంత్రి చెప్పారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను వినియోగించడంతో పాటు, మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. భారత్‌ తో పాటు రాష్ట్రాలన్ని మరింత బలోపేతం కావాలంటే ఇన్నోవేషన్‌, ఇన్‌ క్లూజివ్‌ గ్రోత్‌, ఇన్‌ ఫ్రా స్ట్రక్చర్‌ అనే త్రీ ఐ మంత్రాన్ని పాటించాలని కేటీఆర్‌ సూచించారు.

ప్యానల్ డిస్కషన్ అనంతరం దావోస్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ లో పలు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను కలిశారు. రోషే చైర్మన్ క్రిస్టోఫర్ ప్రాన్జ్ కేటీఆర్ ను కలిసారు. ఈ సమావేశం సందర్భంగా కేటీఆర్ ఆయనకు హైదరాబాద్ నగరం ఫార్మా హబ్ గా ఉన్నదని, ఫార్మాసిటీ మరియు మెడికల్ డివైస్ పార్కుల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. హెఛ్ పీ సీవోవో విశాల్ లాల్, అపోలో టైర్స్ ఉపాధ్యక్షుడు మరియు ఎండీ నీరజ్ కన్వర్, కాల్ల్స్ బెర్గ్ గ్రూప్ చైర్మన్ ప్లెమింగ్ బెసెన్ బాచర్, పిఅండ్ జి దక్షిణాసియా సీఈవో మరియు ఎండీ మాగేశ్వరన్ సురంజన్ లతోనూ మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. వీరితో సమావేశాల సందర్భంగా ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, టెక్స్ట్ టైల్స్ మరియు లైఫ్ లైసెన్స్ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 8 =