తెలంగాణకు చెందిన రూ. 40 వేల కోట్ల భూముల్లోని పీఎస్‌యూల ప్రైవేటీకరణపై, కేంద్ర మంత్రి నిర్మలకు మంత్రి కేటీఆర్‌ లేఖ

Minister KTR Letters Union Finance Minister Nirmala Sitharaman on Privatisation of Corporations Assets in Telangana, Telangana Minister KTR Letters Union Finance Minister Nirmala Sitharaman on Privatisation of Corporations Assets in Telangana, KTR Letters Union Finance Minister Nirmala Sitharaman on Privatisation of Corporations Assets in Telangana, Privatisation of Corporations Assets in Telangana, Telangana Minister KTR Letters Union Finance Minister Nirmala Sitharaman Union Finance Minister Nirmala Sitharaman, Finance Minister Nirmala Sitharaman, Minister Nirmala Sitharaman, Union Finance Minister, Nirmala Sitharaman, Privatisation of Corporations Assets News, Privatisation of Corporations Assets Latest News, Privatisation of Corporations Assets Latest Updates, Privatisation of Corporations Assets Live Updates, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణలోని ఆస్తులపై, భూములపై రాష్ట్ర ప్రజలకు సర్వ హక్కులు ఉంటాయని, వాటిని ఇష్టారీతిన ప్రైవేట్ పరం చేయడానికి గానీ, అమ్మడానికి గానీ ప్రభుత్వాలకు ఎలాంటి అధికారం లేదని పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఒక లేఖ రాశారు. లేఖలో మంత్రి కేటీఆర్‌ కేంద్రం తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు (పిఎస్‌యు) కేటాయించిన భూములతో సహా ఆస్తులను విక్రయించాలని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని, అటువంటి ప్రణాళికలను విరమించుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణలో గత రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఆధ్వర్యంలోని హెచ్‌ఎంటీ, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, హిందుస్థాన్‌ ఫ్లోరో కార్బన్స్‌ లిమిటెడ్‌, హిందుస్థాన్‌ కేబుల్స్‌ లిమిటెడ్‌, ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ తదితర 6 కంపెనీలకు దాదాపు 7,200 ఎకరాల భూములను కేటాయించాయని, ప్రస్తుతం వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.40 వేల కోట్లకు పైనే ఉంటుందని లేఖలో మంత్రి పేర్కొన్నారు. అయితే వాటిని కేంద్రమే నిర్వహించాలని, దీనికి విరుద్ధంగా ఇప్పుడు ఆయా సంస్థలను ప్రైవేటీకరించడమంటే తెలంగాణ ఆస్తులను అమ్ముతున్నట్లుగానే భావిస్తామని అన్నారు. అంత విలువైన ఆస్తులను విక్రయించే బదులు, కేంద్ర ప్రభుత్వం పిఎస్‌యులను పునరుద్ధరించడానికి మరియు బలోపేతం చేయడానికి గల అవకాశాలను అన్వేషించాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలన్న నిర్ణయంపై దేశంలోని అనేక రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లేఖలో మంత్రి కోరారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే అలాంటి భూముల్లో కొత్త పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని కేటీఆర్ అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ముసుగులో పిఎస్‌యులను విక్రయించే ప్రయత్నాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తమ ప్రభుత్వంతో పాటు టీఆర్ఎస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తోందని, ఇప్పటికైనా పీఎస్‌యూల అమ్మకంపై పునరాలోచన చేయాలని లేఖలో మంత్రి కేటీఆర్‌ మోదీ సర్కార్ కు సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 8 =