బీఆర్ఎస్ అంటే భార‌త రాష్ట్ర స‌మితే కాదు.. భార‌త రైతు స‌మితి కూడా – మంత్రి కేటీఆర్

Minister KTR Praises CM KCR For Giving Water To Most of Telangana by Constructing Kaleshwaram Project,Minister KTR Praises CM KCR,CM KCR For Giving Water To Most of Telangana,Kaleshwaram Project,Mango News,Mango News Telugu,Telanganas Kaleshwaram Project,Minister KTR About Kaleswaram Project,Minister KTR Latest News And Updates,Kaleshwaram Project Latest News,Telangana Latest News And Updates,BRS Latest News And Updates

బీఆర్ఎస్ అంటే భార‌త రాష్ట్ర స‌మితే కాదు.. భార‌త రైతు స‌మితి కూడా అని కొత్త భాష్యం చెప్పారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు. శుక్రవారం ఆయన హనుమకొండలో రూ.181 కోట్లతో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. అలాగే పట్టణంలో నూతనంగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీనికి ముందు హసన్‌పర్తి కిట్స్‌ కాలేజీలో ఇన్నోవేషన్‌ హబ్‌ను ప్రారంభించారు. అంతకుముందు హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో రూ.5.20 కోట్లతో నిర్మించిన మాడల్‌ వైకుంఠధామం, సైన్స్‌ పార్కులను, ఇంకా తెలంగాణ స్టేట్‌ సైన్స్‌ టెక్నాలజీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో రూ.8.50 కోట్లతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ సెల్‌ భవనాన్ని ఆయన ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమాల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే స‌తీశ్ కుమార్‌ సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో ఎండాకాలం వ‌చ్చిందంటే స్థానిక ఎమ్మెల్యేలు, జ‌డ్పీటీసీలు గ్రామాల్లోకి వ‌చ్చేందుకు భ‌య‌ప‌డేవారని, అయితే నేడు సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్క ప్ర‌జాప్ర‌తినిధి ధైర్యంగా గ్రామాల్లోకి వ‌స్తున్నారని తెలిపారు. తెలంగాణ సిద్దించకముందు కరువుకు ఆవాసంగా ఉన్న ఈ ప్రాంతంలో సీఎం కేసీఆర్ అప‌ర భ‌గీర‌థుడిలా కాళేశ్వ‌రం నీళ్ల‌తో తెలంగాణలో శాశ్వ‌తంగా క‌రువును త‌రిమేసాడని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆడ‌బిడ్డ‌ల నీటి క‌ష్టాల‌ను తీర్చింది సీఎం కేసీఆర్ మాత్ర‌మేనని, స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఇంటింటికీ మంచినీళ్లు తీసుకొచ్చిన ఘనత ఆయనదేనని మంత్రి కేటీఆర్ చెప్పారు. గత పాలకుల విధానాల వల్లే ప్రజలు అవస్థలు పడ్డారని, అయినా మళ్ళీ అధికారం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారని మండిపడ్డారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో క‌రెంట్ వ‌స్తే వార్త‌.. ఇప్పుడు క‌రెంట్ పోతే వార్త అవుతుందని పేర్కొన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజ‌య్‌ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని, ముందు దేశానికి, ప్రజలకు బీజేపీ, ప్రధాని మోదీ ఏం చేసారో చెప్పాలని కోరారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో క‌రెంట్, తాగునీరు, సాగు నీరు సమృద్ధిగా అందిస్తోందని, రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మి వంటి పలు సంక్షేమ పథకాలను అందిస్తోందని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల రెండు నాల్కల ధోరణిని గుర్తించాలని, తెలంగాణలో ప్రజలకు మేలు జరగాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 6 =