బాల రక్షక్ వాహనాలను ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్

Bala Rakshak Vehicles, Mango News, Maoists menace, Minister releases 33 Bala Rakshak vehicles, Minister Talasani Srinivas, Minister Talasani Srinivas Launches Bala Rakshak Vehicles, Minister Talasani Srinivas Yadav Launch Bala Rakshak Vehicles, Srinivas Yadav Launch Bala Rakshak Vehicles, Talasani Srinivas, Talasani Srinivas Launches Bala Rakshak Vehicles, talasani srinivas yadav, Telangana Bala Rakshak Vehicles, Telangana Minister inaugurates Bala Rakshak Vehicles

ఆపదలో ఉన్న బాలల రక్షణ కోసమే బాల రక్షక్ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద హైదరాబాద్ జిల్లాకు మంజూరైన రెండు బాల రక్షక్ వాహనాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలెక్టర్ శర్మన్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆపదలో ఉన్న బాలల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం 1098 హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసి జిల్లాకు ఒకటి చొప్పున సీఎస్ఆర్ నిధులతో బాలరాక్షక్ వాహనాలను కేటాయించిందని చెప్పారు. హైదరాబాద్ జిల్లాకు రెండు వాహనాలను కేటాయించగా, నేడు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అనాధ బాలలు, భిక్షాటన చేస్తూ 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కడ కనిపించినా బాల్య వివాహం జరుగుతున్నా కానీ 1098 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని కోరారు.

హెల్ప్ లైన్ కు కాల్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి ప్రొటెక్షన్ ఆఫీసర్, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ అధికారులు బాలరాక్షక్ వాహనంతో చేరుకొని వారిని రక్షించి, బాల సదనంకు చేర్చి వారికి వసతి, బోజన సౌకర్యం కల్పిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ వివరించారు. పరిస్థితులను బట్టి పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారుల సహకారం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మహిళా శిశుసంక్షేమ శాఖ పర్యవేక్షణలో బాల రక్షక్ వాహనాలు నిర్వహించబడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ సుమలత, సికింద్రాబాద్ సిడిపిఓ సునంద, ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 11 =