మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన.. జులై 9న సికింద్రాబాద్‌ బోనాల ఉత్సవాలు

Minister Talasani Srinivas Yadav Says Secunderabad Bonalu Festival will be Held on July 9,Secunderabad Bonalu Festival will be Held on July 9,Secunderabad Bonalu Festival,Minister Talasani Srinivas Yadav Says About Bonalu,Mango News,Mango News Telugu,Secunderabad Bonalu 2023,Talasani Srinivas Yadav About Bonalu Festival,Minister Talasani Srinivas Yadav Latest News,Minister Talasani Srinivas Yadav Latest Updates,Secunderabad Bonalu Festival Latest News,Secunderabad Bonalu Festival Latest Updates,Secunderabad Bonalu Festival 2023,Secunderabad Bonalu On July 9

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. సికింద్రాబాద్‌ ఆషాడ బోనాల ఉత్సవాలు ఈ ఏడాది జులై 9 వ తేదీన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సోమవారం ఆయన సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కొత్త పాలక మండలి సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ కృష్ణ, ఈవో మనోహర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్‌లు అత్తిలి అరుణ గౌడ్, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, కిరణ్మయి సహా గణేష్ టెంపుల్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఘనంగా చాటే బోనాల ఉత్సవాలను ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తోందని గుర్తుచేశారు. ప్రతి సంవత్సరం గోల్కొండలో ఆషాడ బోనాల ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత, సికింద్రాబాద్ బోనాలు.. అనంతరం ఓల్డ్ సిటీ బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఈ సంవత్సరం సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు జులై 9వ తేదీన నిర్వహిస్తున్నామని, అలాగే 10 వ తేదీన ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ‘రంగం’ (భవిష్యవాణి) నిర్వహిస్తామని మంత్రి తలసాని వెల్లడించారు. ఇక మహాంకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్ధమై ఆలయాన్ని అభివృద్ధి చేశామని, దీనిలో భాగంగా ఆలయం పరిసరాల్లోని రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేసినట్లు వివరించారు. కాగా అమ్మవారి బోనాల తర్వాతి రోజు వివిధ వేషధారణలు, డప్పు చప్పుళ్ళు, కళాకారుల నృత్యాలతో ఫలహారం బండ్ల ఊరేగింపు నిర్వహిస్తున్నామని, ఈ వేడుక ఉత్సవాలకే ప్రత్యేక కళను తీసుకొస్తుందని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =