సన్ బర్న్ ఈవెంట్‌పై రేవంత్ రెడ్డి సీరియస్

Revanth Reddy Is Serious About The Sunburn Event, Revanth Reddy Is Serious, Sunburn Event Serious Revanth Reddy, Sunburn Event, Sunbur, Sunburn Hyderabad, CM Revanth Reddy, Latest Sunburn Event News, Sunburn Event Updates, TS CM, Telangana, Telangana Politics, Mango News, Mango News Telugu
sunburn event, sunbur, sunburn hyderabad, CM Revanth reddy

సన్ బర్న్.. వివాదాస్పదమైన ఈవెంట్. ఎక్కడ ఈ ఈవెంట్ జరిగిన వివాదాలు చుట్టుముడుతుంటాయి. గతంలో పలుమార్లు హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరగగా.. ప్రతీసారి వివాదాస్పదమయింది. గచ్చిబౌలిలో ఈ ఈవెంట్ జరిగినప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హన్మంతరావు ఏకంగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఎదుట ధర్నాకు దిగారు. అటు ఇతర రాష్ట్రాల్లో సన్ బార్న్ ఈవెంట్ జరిగినప్పుడు కూడా వివాదాలే చుట్టుముడుతుంటాయి.

అయితే త్వరలో న్యూ ఇయర్ రాబోతోంది. దీంతో న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లో సన్ బార్న్ ఈవెంట్ నిర్వహించేందుకు కొందరు సిద్ధమయ్యారు. మాదాపూర్‌లో ఈవెంట్ నిర్వహించేందుకు నిర్వాహకులు ఇప్పటి నుంచే గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో విడుదల చేశారు. చాలా మంది యువతీ యువకులు ఇప్పటికే టికెట్లను బుక్ చేసేసుకున్నారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఈవెంట్‌కు అనుమతి ఎవరిచ్చారని రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారట. అనుమతి లేకుండా టికెట్లు ఎలా విక్రయిస్తారని అడిగారట.

దీంతో వెంటనే అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు ఈవెంట్ నిర్వాహకులు, బుక్ మై షో ప్రతినిధులను పిలిపించి మందలించారట. అనుమతి లేకుండా ఈవెంట్ కండెక్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారట. దీనిపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి మాట్లాడుతూ.. సన్ బర్న్ ఈవెంట్‌కు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. అనుమతి లేకుండానే బుక్ మై షోలో టికెట్ విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలను నిలిపివేశామని తెలిపారు. అలాగే న్యూ ఇయర్ వేడుకల కోసం ఎవరైనా అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =