త్వరలో రద్దు కానున్న ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల విధానం

Mango News Telugu, Political Updates 2019, Talasani Srinivas About Online Cinema Tickets Procedure Cancelation, Talasani Srinivas Yadav About Online Cinema Tickets, Talasani Srinivas Yadav About Online Cinema Tickets Procedure, Talasani Srinivas Yadav About Online Cinema Tickets Procedure Cancelation, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల అమ్మకాలను ప్రభుత్వం త్వరలో రద్దు చేసే యోచనలో ఉందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ప్రభుత్వమే అధికారికంగా టికెట్ల అమ్మకాల కోసం ప్రణాళికలు తయారుచేస్తుందని చెప్పారు. ప్రభుత్వం రూపొందించే నూతన విధాన నిర్ణయం ద్వారా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభం చేకూరుతుందని తెలిపారు.

శనివారం నాడు అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో జరిగిన సంభాషణలో భాగంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలను తలసాని శ్రీనివాస్ ప్రస్తావించారు. థియేటర్ లలో ఇకపై 18 నుంచి 20 లైన్లు, 8 నుంచి 10 వరుసల సిట్టింగ్ ఏర్పాటు చేయబోతునట్లు మంత్రి వివరించారు . రేస్ కోర్స్ కు సంబంధించిన టాక్స్ పై స్పెషల్ డ్రైవ్ చేశామని, గతంలో లక్షల్లో కట్టే పన్ను ఇప్పుడు కోట్లతో కడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం తీసుకురావలనుకుంటున్న టిక్కెట్ల విధానంపై తెలుగు సినీపరిశ్రమ, సినిమా ప్రేక్షకులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =