రానున్న రెండేళ్లలో వైద్య రంగంపై రూ.10,000 కోట్ల ఖర్చు, తెలంగాణ కేబినెట్ నిర్ణయం

Cabinet Appointed Sub-committee to Review Situation in Govt Hospitals, Govt Hospitals, Govt to take up pilot project on health profile, Mango News, Sub-committee to Review Situation in Govt Hospitals, Telangana Cabinet, Telangana Cabinet 2021, Telangana Cabinet Appointed Sub-committee, Telangana Cabinet Appointed Sub-committee to Review Situation, Telangana Cabinet Appointed Sub-committee to Review Situation in Govt Hospitals, Telangana to spend Rs 10K cr to improve healthcare infra

రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ఆరోగ్య సబ్ కమిటీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధ్యక్షులుగా, మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, పి.సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉంటారు. వీరిని దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నటువంటి తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటుగా, ఉత్తమమైన ఆరోగ్య సేవలను అందిస్తున్న పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా వెళ్లి అధ్యయనం చేసి రావాలని, సమగ్ర నివేదికను అందించాలని కేబినెట్ ఆదేశించింది.

రానున్న రెండేళ్లలో వైద్య రంగంపై రూ.10,000 కోట్ల ఖర్చు చేయాలని నిర్ణయం:

మరోవైపు ఇరిగేషన్ రంగాన్ని పటిష్టం చేసి వ్యవసాయంలో గుణాత్మక మార్పులు సాధించిన తరహాలోనే రాష్ట్రంలోని ప్రజారోగ్య వైద్య రంగంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని కేబినెట్ తీర్మానించింది. రానున్న రెండేళ్లలో 10,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసి రాష్ట్రం లోని పేదలకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్యం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు పూర్తి వివరాలు ప్రణాళికతో రిపోర్ట్ సమర్పించాలని మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సబ్ కమిటీకి కేబినెట్ సూచించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − seventeen =