తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు చేరిన “రెమ్‌డెసివర్” ఔషధం

Antiviral Drug Remdesivir, Coronavirus, Coronavirus Drug, Coronavirus Drug Remdesivir, Coronavirus Drug Updates, coronavirus news, Delhi, First Batch of Remdesivir Drug, Maharashtra, Remdesivir, Remdesivir Clinical Trials, Remdesivir Drug, telangana

క‌రోనా వైరస్ నియంత్రణకు హైద‌రాబాద్‌కు చెందిన ప్రముఖ జెనెరిక్ ఫార్మాస్యూటిక‌ల్ కంపెనీ హెటిరో “రెమ్‌డెసివర్” ఔషధాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ‘కోవిఫర్‌’ పేరుతో ఈ జెనెరిక్ ‌ ఔషధం అమ్మకానికి ఇటీవలే హెటిరో కంపెనీకి అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో ఈ ఔషధాన్ని తొలివిడతలో భాగంగా ఐదు రాష్ట్రాలకు పంపించారు. దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు ముందుగా 20,000 వయల్స్ అందించిన‌‌ట్లు హెటిరో కంపెనీ తెలిపింది.

వచ్చే రెండు, మూడు వారాల్లో లక్ష వయల్స్‌ తయారీ లక్ష్యాన్ని చేరుకొని ఇతర రాష్ట్రాలకు కూడా పంపించాలని కంపెనీ నిర్ణయించింది. రెండో విడతలో విజయవాడ, కోల్‌కతా, ఇండోర్‌, భోపాల్‌, లక్నో, పట్నా, భువనేశ్వర్‌, రాంచి, కోచి, తిరువనంతపురం, గోవా నగరాలకు రెమ్‌డెసివర్ ఔషధాన్ని అందజేయనున్నారు. అలాగే కొవిఫర్‌ పంపిణీ కేవలం ప్రభుత్వం, ఆస్పత్రుల ద్వారా మాత్రమే జరుగుతుందని, మార్కెట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉండదని హెటిరో కంపెనీ ప్రకటించింది. 100 మిల్లీగ్రాముల రెమ్‌డెసివర్ ఔష‌ధానికి ధర రూ.5,400 నిర్ణయించినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =