తలసరి విద్యుత్ వినియోగవృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానం : మంత్రి జగదీష్ రెడ్డి

Electricity Consumption Growth Rate, Energy Minister Jagadish Reddy, Jagadish Reddy Speech In Assembly, Mango News, Minister Jagadish Reddy, per Capita Electricity Consumption Growth Rate, power minister jagadish reddy, Telangana Electricity Consumption Growth Rate, Telangana ranks fifth in power consumption, Telangana Ranks First in Country, Telangana Ranks First in Country in per Capita Electricity Consumption Growth Rate

తలసరి విద్యుత్ వినియోగవృద్ధి రేటులో తెలంగాణ యావత్ భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతనే కారణమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పాటుతో అదనంగా 9,689 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర శాసనసభలో మంగళవారం రోజున జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ్యులు క్రాంతి కిరణ్ చంటి, మర్రి జనార్దన్ రెడ్డి, కోరుకంటి చందర్ లు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం ఇస్తూ 7,962 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిందే విద్యుత్ సంక్షోభం నుండి అటువంటి సంక్షోభం సమిసి పోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే అందుకు కారణమన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అటువంటి సంక్షోభం ఓటర్ల ముందు పెట్టి విజయం సాధించిన నేత కేసీఆర్ అని ఆయన కొనియాడారు.

ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా నెగిటివ్ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో పెట్టి నెగ్గి రావడం అంటే ఒక అగ్ని పరిక్షేనని ఆయన అభివర్ణించారు. అటువంటి అగ్ని పరీక్షను సునాయాసంగా నిర్ణిత సమయంలో పరిష్కరించిన మహానేత కేసీఆర్ అన్నారు.మొదటి మూడు నెలలలో గృహ వినియోగదారులతో పాటు పారిశ్రామిక రంగానికి 24 గంటల నిరంతర విద్యుత్ ను సరఫరా చేయడంతో పాటు కేవలం సంవత్సర కాలంలోనే వ్యవసాయానికి 9 గంటలు ఏకధాటిగా విద్యుత్ ను అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. అంతే గాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన మూడు సంవత్సరాల వ్యవదిలోనే వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించిందని తెలిపారు. మొత్తంగా రాష్ట్రాన్ని విద్యుద్దీకరణ చెయ్యాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 16,210 కోట్లతో ట్రాన్స్ మిషన్, ఈహెచ్టి సబ్ స్టేషన్ లు, ఈహెచ్టి లైన్స్ వంటి వాటి మీద ఖర్చు చేయడం జరిగిందన్నారు. అదే విదంగా డిస్కమ్ లు 33 కేవీ ఉపకేంద్రాలతో పాటు పంపిణీ లైన్స్, డిటిఆర్ అండ్ పిటిఆర్ ల కోసం 16,048 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. గృహ, పారిశ్రామిక, వ్యవసాయ ఇతరత్రా కనెక్షన్లు పొందిన వారు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కోటి 65 లక్షలు ఉండగా, తెలంగాణ ఏర్పడ్డాకే 54 లక్షల కనెక్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − twelve =