రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది, 75 శాతం హెల్త్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్ : సీఎస్

Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, Coronavirus India News LIVE Updates, COVID-19 pandemic in India, India Coronavirus, India Covid-19 Updates, Rajiv Gauba, Rajiv Gauba held VC with All States Chief Secretaries on Covid-19, total corona cases in india today, Total Corona Positive Cases in India, total corona positive in india, Union Cabinet Secretary, Union Cabinet Secretary over Coronavirus, Union Cabinet Secretary Rajiv Gauba

కేంద్ర కేబినేట్ కార్యదర్శి డా.రాజీవ్ గౌబా శనివారం నాడు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ కేసులు వేగంగా పెరగకుండా నియంత్రణ కోసం కంటైన్మెంట్, నిఘా, పెద్ద స్ధాయిలో వ్యాక్సినేషన్ తదితర చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా పూర్తి స్ధాయిలో అదుపులో ఉందని కేంద్ర కేబినెట్ సెక్రటరీకి తెలిపారు. రాష్ట్రంలో పాజిటీవ్ రేటు 0.43 శాతం ఉందని, ప్రతి రోజు 200 లోపు కేసులు నమోదు అవుతున్నాయని, ఇది చాలా తక్కువని అన్నారు. రాష్ట్రంలో 1100 లోకేషన్లలో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించడం వలన రాష్ట్రంలో కేసుల సంఖ్యను, కరోనాని నియంత్రించడం సాధ్యమైందని, ఎవరికైన పాజిటీవ్ వస్తే వెంటనే మెడిసిన్ కిట్స్ ను అందిస్తున్నామన్నారు.

ఇక కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కు సంబంధించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 75 శాతం మంది హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్ ఇచ్చామని, మార్చి 1 తేదిన ప్రారంభమయ్యే మూడవ విడత వ్యాక్సినేషన్ కు సిద్ధంగా ఉన్నామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, ప్రజా ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాస్ రావు, వైద్య విద్య సంచాలకులు రమేశ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =