కౌంటింగ్ తర్వాత రోజే కేబినెట్ మీటింగ్‌కు కారణం?

What is the strategy behind KCR Confident,strategy behind KCR Confident,KCR Confident on Elections,KCR Confident Telangana Elections,Mango News,Mango News Telugu,Telangana Assembly Election 2023,Telangana Assembly Election Live Updates,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Genaral Assembly Elections

డిసెంబర్ 4 మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుందని సీఎం కేసీఆర్ ప్రకటించగానే రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉంటే కేసీఆర్ ఏ ధీమాతో కేబినేట్ మీటింగ్ అని ప్రకటించారంటూ ఆశ్యర్యం వ్యక్తం చేశారు.  నిజమే తెలంగాణలో డిసెంబర్ 3న విడుదల అయ్యే ఫలితాల కోసం ప్రధాన పార్టీలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ సారి విజయంపై అధికారపార్టీ బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది.

గతేడాదిలాగే ఎగ్జిట్ పోల్స్ రిజల్టును అధిగమించి 70 పైగా సీట్లు సాధించి మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్ నేతలంతా ధీమాను వ్యక్తం చేస్తుంటే.. అటు కాంగ్రెస్ కూడా 70 నుంచి 80 సీట్లు సాధిస్తామని కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. కానీ  విడుదల అయిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌కే విన్నింగ్ శాతం ఎక్కువగా ఉందని తేల్చేశాయి. దీంతో  అధికారం హస్తం పార్టీ చేతికి వెళ్లకుండా ఉండటానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీర్ మాస్టర్ ప్లాన్  రెడీ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఎలాగైనా మూడోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని  చూస్తున్న కేసీఆర్.. కాంగ్రెస్‌పై పైచేయి సాధించడానికి తన వ్యూహాలకు పదును పెడుతున్నారట.

ప్రస్తుతం మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్  పార్టీకి 50 నుంచి 60 స్థానాలు, బీఆర్‌ఎస్ కు 40 నుంచి 55 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాయి.  కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టడానికి ఇతర పార్టీలతో ఇప్పటికే కేసీఆర్ మంతనాలు జరిపినట్లుగా పొలిటికల్ సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఏంఐఏంతో ఎప్పటి నుంచో పొత్తు ఉండటంతో.. ఆ పార్టీ గెలిచిన స్థానాలు కూడా బీఆర్‌ఎస్ ఖాతాలొకే వెళ్తాయి. అలాగే ప్రస్తుత పరిస్థితులతో కాంగ్రెస్‌ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే.. బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవాలి.

అందుకే బీజేపీకి  1 నుంచి 8 స్థానాలు వచ్చినా కూడా.. బీఆర్‌ఎస్‌కు మద్దతు కోరే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు . అంతేకాదు గత ఎన్నికలలో లాగే  కాంగ్రెస్ లోని గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలను  బీఆర్‌ఎస్ వైపు తిప్పుకోవడానికి తెర వెనుక రాజకీయాలు షురూ చేశారట గులాబీ బాస్.  మొత్తం మీద అధికారం కోల్పోకుండా ఉండటానికి కేసీఆర్ అన్ని రకాలుగా వ్యూహరచన చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్‌ను మించి  కాంగ్రెస్ పార్టీ 70కి పైగా స్థానాల్లో గెలిస్తే.. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడం తప్సదు. అందుకే  కేసీఆర్ తన రాజకీయ చతురతను  ప్రదర్శించి ఎలా అయినా మరోసారి అధికారాన్ని గుప్పిట్లోనే ఉంచుకోవడానికి  గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే ధైర్యంతోనే  డిసెంబర్ 4న కేబినెట్ సమావేశం జరగనుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.  దీంతో అన్ని ఎగ్జిట్‌ పోల్స్.. హస్తం పార్టీ ‌ వైపు మొగ్గు చూపుతుండగా.. కేసీఆర్ సోమవారం కేబినెట్ సమావేశం నిర్వహిస్తుండటంపై ఆసక్తి నెలకొంది. అయితే  ఫలితాలు బీఆర్ఎస్‌కు అనుకూలంగా వస్తే ప్రభుత్వం కొనసాగింపు కోసం కేబినెట్ మీటింగ్.. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వాన్ని రద్దు చేసే అంశంపై నిర్ణయాలు తీసుకోవడానికే ఈ కేబినెట్ భేటీ అనే వాదన వినిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 6 =