జంట నగరాల్లోని 11 రైతు బజార్లలో రూ.35 కే కిలో ఉల్లిగడ్డలు: మంత్రి నిరంజన్ రెడ్డి

Agriculture Minister Niranjan Reddy Says Onions Will Sell on Subsidy in Rythu Bazaars

తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి గడ్డల ధ‌ర‌ల నియంత్ర‌ణ కోసం మార్కెటింగ్ శాఖ కీలక నిర్ణ‌యం తీసుకుంది. నేటి నుండి రైతుబజార్లలో రూ.35 కే కిలో ఉల్లిగడ్డల విక్రయాలు జరపనున్నట్టు రాష్ట్ర వ్య‌వ‌సాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి వెల్లడించారు. జంట నగరాల్లోని 11 రైతుబజార్లలో 35 రూపాయలకే కిలో ఉల్లిగడ్డలు అమ్మేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ప్రతి వ్యక్తికి రెండు కిలోల చొప్పున విక్రయిస్తామని, అయితే ఏదైనా గుర్తింపుకార్డు చూయించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా ఉల్లిపంట దెబ్బతిందని మంత్రి అన్నారు. ఎలాంటి లాభం లేకుండా రవాణా ఖర్చులు, దెబ్బతిన్న సరుకును దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు చేపడుతున్నామని, ఈ మేరకు మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + twenty =